బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ రెండో వారంలోకి అడుగుపెట్టింది. మరో మూడు రోజుల్లో హౌస్ నుండి మరో కంటెస్టంట్ బయటకి వెళ్లనున్నారు. గత వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన ఆరుగురు ఇంటి సభ్యుల నుండి హేమ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ వారం ఎలిమినేషన్ కి నామినేషన్ అయిన వారు శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్ విట్టా, వితికా షేరు, వరుణ్ సందేశ్, రాహుల్, పునర్నవి. ఎనిమిది మంది ఎలిమినేషన్ కి నామినేట్ కావడంతో షో ఆసక్తికరంగా మారింది. అయితే వీరిలో హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంలో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. యాంకర్ కి శ్రీముఖికి బయట ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే.

ఆమెకి లక్షల్లో ఓట్లు  పడుతున్నాయి. పైగా షోలో ఆమె గ్లామర్ టచ్ కోసం భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకొచ్చారు. సో.. ఇప్పట్లో ఆమె హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. వరుణ్ తేజ్ కి కూడా సెలబ్రిటీ హోదా కాస్త ఎక్కువ ఉండడంతో అతడికి కూడా ఓట్లు బాగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా చూసుకుంటే ఎనిమిది మంది కంటెస్టంట్స్ లో జాఫర్, వితికా షేరులకు మాత్రమే తక్కువ ఓట్లు వచ్చాయని సమాచారం.

వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండగా.. ఎక్కువ అవకాశాలు వితికాకే ఉన్నాయని.. ఆమె ఈ వారం హౌస్ నుండి వెళ్లిపోతుందని అంటున్నారు. గతవారం అందరూ ఊహించిన విధంగానే నటి హేమ ఎలిమినేట్ కావడంతో ఊహాగానాలకు ప్రాధాన్యం సంతరించుకుంది.