Asianet News TeluguAsianet News Telugu

త్రిపుల్ తలాక్ చట్టం.. రాష్ట్రపతి ఆమోద ముద్ర

త్రిపుల్ తలాక్ విధానం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు 2017లోనే తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ అది కొనసాగుతూనే ఉండటంతో... దానిని చట్ట రూపం దాల్చాలని మోదీ ప్రభుత్వం భావించింది. 

Day After Triple Talaq Bill Clears Rajya Sabha, President Ram Nath Kovind Gives Assent
Author
Hyderabad, First Published Aug 1, 2019, 10:37 AM IST

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన త్రిపుల్ తలాక్ బిల్లు చట్టరూపం దాల్చింది. పార్లమెంట్ ఉభయసభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లుకి తాజాగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు ఈ విషయాన్ని ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. దీంతో ప్రస్తుతమున్న ఆర్డినెన్స్ స్థానంలో చట్టం వచ్చేసింది.

త్రిపుల్ తలాక్ విధానం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు 2017లోనే తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ అది కొనసాగుతూనే ఉండటంతో... దానిని చట్ట రూపం దాల్చాలని మోదీ ప్రభుత్వం భావించింది. అదే సంవత్సరం డిసెంబర్ లో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు లోక్ సభలో ఆమోదం పొందినా, రాజ్యసభలో తగిన బలంలేక వెనకడుగు వేయాల్సి వచ్చింది.

ఈ పార్లమెంటు సమావేశాల్లో మరోసారి బిల్లును తీసుకురాగా.... జులై 25వ తేదీన లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును జులై 30న రాజ్యసభకు తీసుకువచ్చారు. పెద్దల సభలో ఎన్డీయే తగినంత సంఖ్యా బలం లేకపోయినప్పటికీ... కొన్ని పార్టీలు ఓటింగ్ కి దూరంగా ఉండటం, మరికొన్ని పార్టీలు వాకౌట్ చేయడం ప్రభుత్వానికి కలిసివాచ్చాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios