తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం ముగిసింది. రాష్ట్ర విభజన సమస్యలతో పాటు గోదావరి జలాల మళ్లింపుపై ఇద్దరు నేతలు సుమారు మూడు గంటల పాటు చర్చించినట్లుగా తెలుస్తోంది.

గోదావరి జలాల్ని శ్రీశైలానికి తరలించడంపై జూన్ 28న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఇంజనీర్లు ఇచ్చిన ప్రతిపాదనలపై కేసీఆర్, జగన్ సమాలోచనలు జరిపారు. అలాగే ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల పంపకం, విద్యుత్ బకాయిలు, 9,10 షెడ్యూళ్లలోని సంస్థల విభజనపైనా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరిపారు.

ఈనెల 8న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎస్ లు, ఉన్నతాధికారుల సమావేశం జరగనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ సమావేశంలో చర్చించే అంశాలు, అజెండాలపై ఇరువురు చర్చించుకోనున్నట్లు తెలుస్తోంది. తొలి ప్రాధాన్యంశాలుగా ఏ అంశాలపై మాట్లాడి అనే దానిపై చర్చించనున్నారు. ముఖ్యంగా గోదావరి జలాలను శ్రీశైలం తీసుకెళ్లే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. 

అలాగే ఉమ్మడి ఆస్తులు, కార్పొరేషన్లు, ఉద్యోగుల పంపకాలు, విద్యుత్ శాఖలో 1100 మంది ఉద్యోగులు, జూనియర్ కళాశాలలో లెక్చరర్లు, ఉమ్మడి హెచ్ వోడీ కార్యాలయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే గురువారం సాయంత్రం 3గంటలకు సీఎం వైయస్ జగన్ కుటుంబ సమేతంగా పవిత్ర పుణ్యక్షేత్రం జెరూసలేం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 8న జరగబోయే రెండు రాష్ట్రాల సమావేశాలపై చర్చించే అవకాశం లేకపోయే నేపథ్యంలో ముందుగానే జగన్ కలుస్తున్నారు. కేసీఆర్ తో సుమారు గంటన్నర పాటు వైయస్ జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ సాయంత్రం 3 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ముంబాయి వెళ్తారు. ముంబాయి నుంచి నేరుగా జెరూసలేం వెళ్తనున్నారు. నాలుగురోజులపాటు జెరూసలేంలోనే గడపనున్నారు.  అనంతరం తిరిగి ఐదో తేదీన మధ్యాహ్నం అమరావతి చేరుకుంటారు. 

ఈనెల 6న అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. 6న ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్టు, పోలవరం ప్రాజెక్టు నిధులు, పునర్విభజన చట్టంలోని హామీల అమలుకు సహకరించాలి ప్రధాని మోదీని కలవనున్నారు. 

అనంతరం ఈనెల 8న అనంతపురం జిల్లాలో సీఎం వైయస్ జగన్ పర్యటించనున్నారు. కియా ను సందర్శిస్తారని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ వెల్లడించారు. 
నవరత్నాల అమలుపై నివేదికను తయారు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు కలెక్టర్.  

ఆయా శాఖల్లో ఉన్న సమస్యలకు సంబంధించిన నివేదికను కూడా ఇవ్వాలని ఆదేశించారు. జేసీ2  ,పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ పర్యటనకు సంబంధించి కియా యాజమాన్యం  సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ గవర్నర్ నరసింహన్ తో ఏపీ సీఎం జగన్ భేటీ