బందర్ పోర్టుని తెలంగాణ ప్రభుత్వానికి ఎంతకు అమ్మేశారంటూ... మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన వారు..అధికార పార్టీ నేతలపపై ప్రశ్నల వర్షం కురిపించారు. 

రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే బందరు పోర్టు పనులు చేసే  యంత్రాలు వెనక్కి వెళ్లిపోయాయని వారు ఆరోపించారు. జగన్ ప్రభుత్వం క్విడ్ ప్రోకో ద్వారా తెలంగాణకు ఇచ్చేసిందని విమర్శించారు. తమపై పదేపదే ట్వీట్లు పెట్టే విజయసాయి రెడ్డి  ఇటవల జరిగిన సెర్బియా అరెస్టులపై ఎందుకు ట్వీట్ చేయలేదని  ప్రశ్నించారు. పరోక్షంగా నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు గురించి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

బెయిల్‌పై తిరుగుతున్న ఆయన తమను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. బందరు పోర్ట్ పై సీఎం జగన్ ప్రకటన చెయ్యాలని డిమాండ్‌ చేశారు. బందరు పోర్టుపై  ప్రభుత్వం ఇచ్చిన రహస్య జీవోలను బహిర్గతం చేయాలని కొల్లు రవీంద్ర అన్నారు. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.