కాపు రిజర్వేషన్ల మంట: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Jul 29, 2019, 6:59 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

కాపు కోటాపై చంద్రబాబుది పెద్ద తప్పు: జగన్

కాపు రిజర్వేషన్లపై టీడీపీ సర్కార్ అవలంభించిన విధానాలపై  ఏపీ సీఎం వైఎస్ జగన్  విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ తీసుకొన్న నిర్ణయాల వల్లే  కాపులకు నష్టం వాట్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

చంద్రబాబు మాస్టర్ డిగ్రీ, అందుకే ఈ దుస్థితి: రెబెల్ స్టార్ కృష్ణంరాజు

కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారంటూ విరుచుకుపడ్డారు. అందుకే చంద్రబాబు నాయుడుకు ఈ దుస్థితి పట్టిందని ఆరోపించారు. మరోవైపు నరసాపురం- సఖినేటిపల్లి మధ్య గోదావరి నదిపై వశిష్ట వారధి నిర్మాణానికి కృషి చేస్తానని మాజీకేంద్రమంత్రి కృష్ణంరాజు హామీ ఇచ్చారు.  
 

 

మనోభావాలపై క్రీడ: జగన్ నిర్ణయం బెడిసి కొడుతుందా?

ప్రభుత్వోద్యోగాల్లో రేజర్వేషన్ల గురించి మనందరికీ తెలుసు. కానీ ప్రైవేట్ సంస్థల్లో కూడా 75శాతం స్థానికులకు రిజర్వేషన్ కల్పిస్తామని జగన్ ప్రభుత్వం పాస్ చేసిన బిల్ ఒకింత చేర్చకైతే దారితీసింది. 

 

అలా అయితే జగన్ కు కష్టమే: మాజీ సీఎం రోశయ్య సంచలన వ్యాఖ్యలు

వైయస్ జగన్ ప్రభుత్వం అటు కేంద్రంతో సఖ్యతగా లేదని పోనీ విపక్షాలను సైతం కలుపుకుని వెళ్లడం లేదన్నారు. జగన్ నిర్ణయాలపై కాస్త స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు.  ఖర్చులు తగ్గించుకుని పొదుపుగా ప్రభుత్వాన్ని నడపాలని సూచించారు. అలా అయితేనే కొంతకాలం నడుస్తుందని లేదంటే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించారు కొణిజేటి రోశయ్య.    
 

దళిత ఎమ్మెల్యే ధర్నా, గో మూత్రం చల్లి శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు: వెల్లువెత్తుతున్న విమర్శలు

ఆమె కూర్చున్న ప్రదేశంలో నీళ్లు చల్లి గోమూత్రంతో శుద్ధి చేశారు. ఆమె ప్రజలను మోసం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తీరుపై ఎమ్మెల్యే గీతా గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని సీఎం విజయన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యకర్తలు చేసిన పనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇసుక నదిలో లేదు, వారి పొట్టలో ఉంది: వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు

రాష్ట్రంలోని ఇసుక కొరత కారణంగా భవన కార్మికులు ఇబ్బంది పడుతున్నారంటూ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ నేతలు సభ దృష్టికి తీసుకొచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నేతలు అవలంబించిన ఇసుక దోపిడీ కారణంగానే రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొందని జోగీ రమేశ్‌ స్పష్టం చేశారు.  

 

కమెడియన్ అలీకి జగన్ బంపరాఫర్ ఇదే...

అమరావతి: ఆంధ్రప్రదేశ్  చలనచిత్ర అభివృద్ది సంస్థ ఛైర్మెన్ గా ప్రముఖ హాస్యనటుడు అలీని నియమించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ భావించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఎన్నికలకు ముందు అలీ వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.

 

ఆ పోర్టు తెలంగాణకు అప్పగించేందుకు జగన్ ప్రయత్నాలు : చంద్రబాబు సంచలన ఆరోపణలు

పోర్టులపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్నేహాలకు, సొంత లాలూచీలకు రాష్ట్ర ఆస్తులను ధారాదత్తం చేస్తామంటే తెలుగుదేశం పార్టీ సహించేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.  

 

కాపు కోటా: చంద్రబాబుకు వైఎస్ జగన్ కౌంటర్ వ్యూహం

కాపులకు రిజర్వేషన్ల అంశం ఏపీ రాజకీయాల్లో వేడిని పుట్టించింది. అధికార వైఎస్ఆర్‌సీపీ, విపక్ష టీడీపీలు ఈ విషయమై ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి.

 

 

కాపులకు ద్రోహం చేసిందెవరో మీకు తెలీదా.. జ్యోతుల నెహ్రూ కి విజయసాయి పంచ్

కాపులకు ద్రోహం చేసింది ఎవరో మీ అంతరాత్మనే అడగండి అంటూ టీడీపీ నేత జ్యోతుల నెహ్రూని విజయసాయి ప్రశ్నించారు. పదవి, ప్యాకేజీ కోసం మీరు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది వాస్తం కాదా అని ప్రశ్నించారు. అసాధ్యమనీ తెలిసీ 5శాతం రిజర్వేషన్ ప్రకటిస్తే... చంద్రబాబుని పొగిడింది మీరు కదా అని అన్నారు. ఇప్పుడు ఎవరు ఉసిగొలిపితే... జ్యోతుల ఇలా విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలుసునని విజయసాయి పేర్కొన్నారు.

 

కాపు రిజర్వేషన్ల సెగ: ముగ్గురు సభ్యులతో కమిటీ వేసిన జగన్

కాపులకు రిజర్వేషన్ కల్పించే అంశంపై వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కన్నబాబు, అంబటి రాంబాబు ఉంటారు

 

వైఎస్ అన్నం పెడితే.. జగన్ పొట్టకొడుతున్నాడు, చంద్రబాబు వల్లే బీజేపీ... కన్నా కామెంట్స్

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారం బీజేపీదేనని కన్నా ధీమా వ్యక్తం చేశారు. రాజన్న పాలన తెస్తామంటూ జగన్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండటం లేదన్నారు.  రాష్ట్రంలో బీజేపీ బలపడలేకపోవడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. టీడీపీ, జనసేనల నుంచే కాకుండా వైసీపీ నుంచి కూడా చాలా మంది నేతలు బీజేపీలో వచ్చి చేరుతున్నారని చెప్పారు.

 

మేమంటే ఎందుకంత కసి: జగన్‌పై జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్‌లో 5 శాతం కాపుకు వర్తింపజేస్తూ టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన తీర్మానాన్ని నెహ్రూ గుర్తు చేశారు. కానీ జగన్ మాత్రం కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యపడదని కసి తీర్చుకోవడమేనని ఆయన దుయ్యబట్టారు.

 

నోటికి ప్లాస్టర్ వేసుకుంటా: జగన్‌కు ముద్రగడ ఘాటు లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈబీసీ కోటాలో 5 శాతం రిజర్వేషన్లపై ... ఏ కోర్టు స్టే ఇచ్చిందో సీఎం జగన్ చెబితే సంతోషిస్తానన్నారు

 

గ్రేటర్ లో ఒకప్పుడు చక్రం తిప్పిన ముఖేష్

2018 ముందస్తు ఎన్నికల్లో గోషామహాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముఖేష్ గౌడ్ క్యాన్సర్ వ్యాధిబారిన పడ్డారు. కనీసం ఎన్నికల ప్రచారంలో సైతం కనుగొనలేదు. వీల్ చైర్ పై వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.  
 

 

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూత

హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ సోమవారం నాడు కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

 

అశ్రునయనాల మధ్య జైపాల్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి

మాజీ కేంద్ర మంత్రి  జైపాల్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆశ్రునయనాల మధ్య పార్టీ నేతలు, కుటుంబసభ్యులు జైపాల్ రెడ్డికి కడసారి వీడ్కోలు పలికారు.

 

జైపాల్ రెడ్డి అంతిమ యాత్ర: కన్నీళ్లు పెట్టిన కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్

మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని గుర్తు చేసుకొంటూ కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కన్నీళ్లు పెట్టుకొన్నారు. జైపాల్ రెడ్డి పాడె మోస్తూ పదే పదే ఆయన కన్నీళ్లు పెట్టుకొన్నారు. 

 

ఉత్తమ్ తో మంతనాలు... మాజీ ఎంపీ వివేక్ యూటర్న్?

టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఏ పార్టీలో చేరకుండా సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వివేక్.... ఇటీవలే బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. 

 

చిక్కడపల్లిలో వ్యాపారవేత్త కిడ్నాప్.. రూ.3 కోట్లు డిమాండ్

హైదరాబాద్ చిక్కడపల్లిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి గజేంద్రప్రసాద్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. రూ. కోటికి ఒప్పందం కుదుర్చుకుని గజేంద్రప్రసాద్‌ను విడిచిపెట్టారు. 

 

RRR: ఇకపై ఎన్టీఆర్ బిజీ.. ఆలోచన విరమించుకున్న రాజమౌళి!

దర్శకధీరుడు రాజమౌళి తెరక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ అంత సాఫీగా ఏం జరగడం లేదు. రాంచరణ్, ఎన్టీఆర్ పోటీ పడుతూ గాయాలకు గురవుతున్నారు. దీనితో దాదాపు నెలరోజుల పాటు షూటింగ్ వాయిదా పడింది. కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 

 

బిగ్ బాస్ 3: హైపర్ ఆది, స్నేహ, శ్రద్దా దాస్ మద్దతు ఆమెకే.. అందుకే సేఫ్!

బిగ్ బాస్ సీజన్ 2లో పోటీ అంత రసవత్తరంగా లేదు. కౌశల్ ఆర్మీ పేరుతో బయట నానా హంగామా జరిగింది. హౌస్ లోపల కేవలం కౌశల్, గీతా మాధురి మధ్యనే పోటీ జరిగింది. కానీ సీజన్ 3లో పరిస్థితి అలా కనిపించడం లేదు. ఒకరినిమించేలా మరొకరు హౌస్ లో కనిపిస్తున్నారు. హిమజ, పునర్నవి, శ్రీముఖి లాంటి కంటెస్టెంట్స్ మధ్య బలమైన పోటీ ఉండబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

 

ఆ గాసిప్స్ విని నా భార్య ఏడ్చింది.. పూరి జగన్నాధ్!

పూరి జగన్నాధ్ కు ఇస్మార్ట్ శంకర్ రూపంలో చాలా రోజుల తర్వాత ఘనవిజయం సొంతమైంది. హీరో రామ్, నాభా నటేష్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. పూరి జగన్నాధ్ తన సొంత బ్యానర్ లో చార్మి తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించాడు. 

 

బిగ్ బాస్ 3: ఎలిమినేట్ అయిన కంటెస్టంట్ ని రాత్రంతా హోటల్ లోనే..!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కి ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే బిగ్ బాస్ సీజన్ 2 ప్రసారమయిన సమయంలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయాలు ముందుగానే తెలిసిపోయేవి. దానికి మెయిన్ రీజన్ బిగ్ బాస్ హౌస్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయడమే.. శనివారం, ఆదివారం ఎపిసోడ్ లు కలిపి శనివారం నాడే షూట్ చేస్తారు. 

 

లండన్ ట్రిప్ కి వెళ్తోన్న అనుష్క, ప్రభాస్..!

దక్షిణాది అగ్ర తారలు ప్రభాస్, అనుష్కల మధ్య ఎఫైర్ నడుస్తుందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఆన్ స్క్రీన్ మీద ఈ జంటని చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. పబ్లిక్ గా వీరిద్దరూ కలిసి కనిపిస్తే అందరి కళ్లు వాళ్ల మీదే ఉంటాయి.

 

తిరిగి తిరిగి కాజల్ దగ్గరే వాలిన మెగాస్టార్!

వరుస హిట్లతో దూసుకుపోతున్న కొరటాల దర్శకత్వంలో చిరంజీవి నటించే సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. గత ఏడాదిగా ఈ చిత్రం గురించి వార్తలు వస్తున్నా ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆగష్టు 22 మెగాస్టార్ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ చిత్రం ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

అక్కా.. అక్కా.. అంటూనే.. 'బిగ్ బాస్' షోపై హేమ సంచలన ఆరోపణలు!

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతున్న బిగ్ బాస్ మూడో సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. షో మొదలైన వారానికి ఎలిమినేషన్ లో కంటెస్టంట్ హేమ బయటకొచ్చేసింది. ఆ సమయంలో హోస్ట్ నాగార్జున అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పింది. హౌస్ లో అంతా బాగానే ఉందని చెప్పింది. కానీ బయటకి వచ్చేసి మాట 
 

ఛార్మీకి ఏ ఆఫర్స్ వస్తున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

 జ్యోతిలక్ష్మి సినిమా త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ ఛార్మి తెర‌పై క‌నిపించ‌లేదు.. ఇక క‌నిపించ‌న‌ని క్లారిటీ కూడా ఇచ్చేసింది ఛార్మి. ఆ తర్వాత పూర్తి గా పూరి దగ్గరే సెటిలైంది. పూరి ప్రొడక్షన్ లో పనిచేసింది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఆమె సినిమాకు సంభందించి అన్ని విభాగాలు చూసుకోవటం మొదలెట్టింది. 

 

నాపై చెయ్యి పడనివ్వను.. కియారా అద్వానీ కామెంట్స్!

ఉత్తరాది ముద్దుగుమ్మ కియారా అద్వానీ 'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు తెరకి పరిచయమై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఆమె నటించిన 'వినయ విధేయ రామ' ఫ్లాప్ కావడంతో మళ్లీ బాలీవుడ్ కి వెళ్లిపోయింది. వెబ్ సిరీస్, సినిమాలంటూ బిజీగా గడుపుతోంది. 

 

దిల్ రాజుని విజయ్ దేవరకొండ పట్టించుకోవడం లేదా..?

ఫిల్మ్ సర్కిల్స్  నుంచి అందుతున్న సమాచారం మేరకు గత కొంతకాలంగా ఓ దర్శకుడు తో కథ రెడీ చేయించి విజయ్ దేవరకొండ దగ్గరకు పంపారట దిల్ రాజు. తను వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాయని సున్నితంగా తిరస్కరించారట. 

 

నాగార్జునపై నటి శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్!

‘బిగ్ బాస్’పై ఇటీవల తలెత్తిన సెక్సువల్ ఫేవర్ వివాదంపై తాజాగా నాగార్జున స్పందించిన విషయం తెలిసిందే. తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారంటూ నాగ్ కామెంట్ చేశారు. దీనిపై ఇప్పుడు శ్రీరెడ్డి పరోక్షంగా పంచ్‌లు విసిరారు.
 

 

click me!