Asianet News TeluguAsianet News Telugu

ఉత్తమ్ తో మంతనాలు... మాజీ ఎంపీ వివేక్ యూటర్న్?

టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఏ పార్టీలో చేరకుండా సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వివేక్.... ఇటీవలే బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. 

tpcc chief uttam kumar reddy meets EX MP vivek
Author
Hyderabad, First Published Jul 29, 2019, 10:02 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మాజీ ఎంపీ వివేక్ యూటర్న్ తీసుకోనున్నారా? ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. ఇలాంటి సందేహాలే అందరికీ కలుగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఏ పార్టీలో చేరకుండా సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వివేక్.... ఇటీవలే బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. బీజేపీ జాతీయాధక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యి.. త్వరలో పార్టీలో చేరతానని కూడా ప్రకటించారు. కాగా... తాజాగా ఆయన టీపీసీసీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు.

ఆదివారం ఉత్తమ్..వివేక్ ఇంటికి వెళ్లి మరీ దాదాపు గంటపాటు మంతనాలు జరిపారు. తమ పార్టీలో చేరాల్సిందిగా ఉత్తమ్ వివేక్ ని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరడం ఖాయమని అందరూ భావించిన సమయంలో ఇలా ఉత్తమ్ తో చర్చలు జరపడం రాజకీయంగా ఆసక్తి రేకెత్తించాయి. అయితే... వివేక్ కాంగ్రెస్ లో చేరతారా..? బీజేపీ వైపు మెగ్గు చూపుతారో తేలాల్సింది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ విషయంపై స్పష్టత రానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios