బిగ్ బాస్ సీజన్ 2లో పోటీ అంత రసవత్తరంగా లేదు. కౌశల్ ఆర్మీ పేరుతో బయట నానా హంగామా జరిగింది. హౌస్ లోపల కేవలం కౌశల్, గీతా మాధురి మధ్యనే పోటీ జరిగింది. కానీ సీజన్ 3లో పరిస్థితి అలా కనిపించడం లేదు. ఒకరినిమించేలా మరొకరు హౌస్ లో కనిపిస్తున్నారు. హిమజ, పునర్నవి, శ్రీముఖి లాంటి కంటెస్టెంట్స్ మధ్య బలమైన పోటీ ఉండబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. 

ఇక సింగర్ రాహుల్, మహేష్ విట్టా ఢీ అంటే ఢీ అనే వ్యక్తిత్వంతో కనిపిస్తున్నారు. వరుణ్ సందేశ్- వితిక జోడీపై ప్రేక్షకులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. అలీ రెజా ఆడియన్స్ అటెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నాడు. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇదిలా ఉండగా హిమజ గురించి ప్రత్యేకంగా అభిమానుల్లో చర్చ జరుగుతోంది. సూటిగా మాట్లాడడం, సున్నితమైన భావజాలం ఉండడంతో హిమజ అందరికి నచ్చేస్తుంది. తొలి వారంలోనే హిమజ నామినేషన్ లోకి వెళ్ళింది. నామినేషన్ లో ఉన్నవారిలో సేఫ్ అయిన తొలి కంటెస్టెంట్ హిమజ. అందుకు ఆసక్తికర కారణాలు కనిపిస్తున్నాయి. 

హిమజకు టాలీవుడ్ సర్కిల్స్ లో మంచి క్రేజ్ ఉంది. హైపర్ ఆది, స్నేహ, శ్రద్దా దాస్ లాంటి సెలెబ్రిటీలు బహిరంగంగా హిమజకు మద్దతు చెబుతున్నారు. బిగ్ బాస్ లో తనకు నచ్చిన సెలెబ్రిటీ హిమజ అంటూ హైపర్ అది ఓ వీడియో కూడా పోస్ట్ చేశాడు. 

హిమజ 'వినయవిధేయ రామ' చిత్రంలో నటించింది. దీనితో స్నేహతో ఆమెకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. స్నేహ కూడా హిమజకు మద్దతు తెలిపింది. శ్రద్దా దాస్, మధుమిత కూడా హిమజకే సపోర్ట్ చేసి ఓట్ చేయాలని అభిమానులని కోరారు. అభిమానుల్లో ఉన్న క్రేజ్, సెలెబ్రిటీల అండతో తొలివారం హిమజకు అత్యధిక ఓట్లు నమోదైనట్లు సమాచారం. అందుకే హిమజ సులభంగా ఎలిమినేషన్ నుంచి బయట పడింది.