దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాతతో పనిచేయాలని దాదాపు అందరూ హీరోలు ఉత్సాహం చూపిస్తారు. దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేస్తే ఓ సుఖం ఉంటుంది. కేవలం ప్రొడక్షన్ మాత్రమే కాక సినిమా స్క్రిప్టు నుంచి రిలీజ్ అయ్యాక పడే పోస్టర్ దాకా అంతా తనదే బాధ్యత అన్నట్లుగా ఆయన జాగ్రత్తలు తీసుకుంటారు. హీరోలు షూటింగ్ వచ్చి కూల్ గా వెల్లిపోవచ్చు. ఓ మాదరి టాక్ ఉన్న సినిమాని సైతం సూపర్ హిట్ గా నిలపగల సత్తా ఉన్న నిర్మాత కావటం, ఆయన చేతిలో థియోటర్స్ ఉండటంతో హీరోలకు ఆయనతో పనిచేయటం ఇష్ట. అయితే విజయ్ దేవరకొండ మాత్రం ఇప్పటిదాకా ఆయనతో చేయలేదు. 

దిల్ రాజుతో వ్యాపారంలో  పోటీగా ఉండే అల్లు అరవింద్ సైతం విజయ్ తో సినిమా చేసేసారు.కానీ ఆయనకు మాత్రం డేట్స్ ఇవ్వటం లేదు. ఫిల్మ్ సర్కిల్స్  నుంచి అందుతున్న సమాచారం మేరకు గత కొంతకాలంగా ఓ దర్శకుడు తో కథ రెడీ చేయించి విజయ్ దేవరకొండ దగ్గరకు పంపారట. తను వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాయని సున్నితంగా తిరస్కరించారట. దాంతో కొద్ది గ్యాప్ ఇచ్చి వేరే కథను వేరే దర్శకుడుతో పంపినా అదే సమాధానం వచ్చిందిట. దాంతో దిల్ రాజు ప్రొడక్షన్ అంటే విజయ్ దేవరకొండ ఎవాయిడ్ చేస్తున్నాడనే ప్రచారం మొదలైంది. అయితే అందుకు కారణమేంటనేది తెలియలేదట. 

ఇక విజయ్ దేవరకొండతోనే చేయాలని పట్టుపట్టుకుని కూర్చున్న ఓ దర్శకుడు ...దిల్ రాజు ప్రొడక్షన్ వల్ల అది జరిగే పనిలా లేదని వేరే కంపెనీకు షిప్ట్ అయ్యాడంటున్నారు.  అయితే దిల్ రాజు మరీ కొత్త దర్శకులని లేదా ఫెయిల్యూర్ లో ఉన్న దర్శకులను పంపకుండా ఏ కొరటాల శివ లాంటి స్టార్ డైరక్టర్ నో పట్టుకుని విజయ్ దేవరకొండను టచ్ చేస్తే పని అవుతుందని అంటున్నారు.