అమరావతి: ఆంధ్రప్రదేశ్  చలనచిత్ర అభివృద్ది సంస్థ ఛైర్మెన్ గా ప్రముఖ హాస్యనటుడు అలీని నియమించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ భావించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఎన్నికలకు ముందు అలీ వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.

ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో  వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా  అలీ ప్రచారం నిర్వహించారు. పార్టీలో చేరే ముందే పోటీ చేయడానికి అవకాశం కల్పించలేనని జగన్ అలీకి స్పష్టం చేశారు. అయితే భవిష్యత్తులో మాత్రం సముచిత స్థానం కల్పిస్తామని  జగన్ హామీ ఇచ్చారు.

ఇందులో భాగంగానే నామినేటేడ్ పదవుల ఎంపికలో అలీకి జగన్ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవికి అలీని నియమిస్తారని వైఎస్ఆర్‌సీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది

ఇదే విషయాన్ని సినీ క్రిటిక్ కత్తి మహేష్  తన ఫేస్‌బుక్ పోస్టులో కూడ రాశాడని చెబుతున్నారు.  త్వరలోనే ఏపీ ప్రభుత్వం అలీకి నియామకపు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని చెబుతన్నారు.