హైదరాబాద్ చిక్కడపల్లిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి గజేంద్రప్రసాద్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. ఆటోమొబైల్ ఫైనాన్స్ చేస్తున్న ఆయనకు ముంబైలోని పలువురు వ్యాపారవేత్తలతో విభేదాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

గజేంద్రప్రసాద్‌ను అపహరించిన దుండగులు సుమారు రూ. 3 కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తున్నారు. అయితే చివరికి రూ. కోటికి ఒప్పందం కుదుర్చుకుని గజేంద్రప్రసాద్‌ను విడిచిపెట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసిన వారు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. దుండగుల దాడిలో స్వల్పగాయాలైన గజేంద్రప్రసాద్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.