నర్సాపురం: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్రమంత్రి, రెబెల్ స్టార్ కృష్ణంరాజు. అబద్దాలు, మోసాలు చేయడంలో చంద్రబాబు నాయుడు మాస్టర్ డిగ్రీ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారంటూ విరుచుకుపడ్డారు. అందుకే చంద్రబాబు నాయుడుకు ఈ దుస్థితి పట్టిందని ఆరోపించారు. మరోవైపు నరసాపురం- సఖినేటిపల్లి మధ్య గోదావరి నదిపై వశిష్ట వారధి నిర్మాణానికి కృషి చేస్తానని మాజీకేంద్రమంత్రి కృష్ణంరాజు హామీ ఇచ్చారు.  

ఇకపోతే ప్రస్తుతం నరసాపురం-సఖినేటిపల్లిల మధ్య గోదావరిపై వశిష్ట వారధి నిర్మాణంపై అసెంబ్లీలో ప్రస్తావించారు జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, వైసీపీ ఎమ్మెల్యే మదునూరి ప్రసాదరాజు. ఇదే అంశంపై కృష్ణంరాజు మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.