ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడానికి కాపులు కూడా కారణమని.. కానీ జగన్ మాత్రం కాపు సామాజిక వర్గంపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్‌లో 5 శాతం కాపుకు వర్తింపజేస్తూ టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన తీర్మానాన్ని నెహ్రూ గుర్తు చేశారు.

కానీ జగన్ మాత్రం కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యపడదని కసి తీర్చుకోవడమేనని ఆయన దుయ్యబట్టారు.  టీడీపీ కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ అమలు జరిగేలా వైసీపీ ప్రభుత్వం.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నెహ్రూ డిమాండ్ చేశారు.

తనకు నాయకత్వం ముఖ్యం కాదని.. కాపులకు న్యాయం చేయడమే ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నేతలు, పెద్దలతో కలిసి 5 శాతం రిజర్వేషన్‌ సాధనపై చర్చిస్తామని జ్యోతుల తెలిపారు.

జగన్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఉద్యమిస్తామని నెహ్రూ వెల్లడించారు. గోదావరి నీటిని తెలంగాణకు తరలించి.. జగన్, కేసీఆర్ రుణం తీర్చుకుంటున్నారని నెహ్రూ ఆరోపించారు.

ఆంధ్రా వాటాకు రావాల్సిన నీటిని తెలంగాణకు దోచిపెట్టడం ద్వారా ముఖ్యమంత్రి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మన సొమ్ముతో మన నీటిని పక్క రాష్ట్రానికి తరలించాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని నెహ్రూ విమర్శించారు. 

కాపులకు ద్రోహం చేసిందెవరో మీకు తెలీదా.. జ్యోతుల నెహ్రూ కి విజయసాయి పంచ్

కాపు రిజర్వేషన్ల సెగ: ముగ్గురు సభ్యులతో కమిటీ వేసిన జగన్

నోటికి ప్లాస్టర్ వేసుకుంటా: జగన్‌కు ముద్రగడ ఘాటు లేఖ

కాపు రిజర్వేషన్లు: చంద్రబాబు చేతికి జగన్ ఆస్త్రం

కాపు రిజర్వేషన్... సీఎం జగన్ పై చినరాజప్ప విమర్శలు

మేమంటే ఎందుకంత కసి: జగన్‌పై జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలు

కాపు రిజర్వేషన్లపై జగన్ ఫోకస్: కాపు నేతలతో భేటీ

కాపు కోటా: చంద్రబాబుకు వైఎస్ జగన్ కౌంటర్ వ్యూహం