బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతున్న బిగ్ బాస్ మూడో సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. షో మొదలైన వారానికి ఎలిమినేషన్ లో కంటెస్టంట్ హేమ బయటకొచ్చేసింది. ఆ సమయంలో హోస్ట్ నాగార్జున అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పింది. హౌస్ లో అంతా బాగానే ఉందని చెప్పింది. కానీ బయటకి వచ్చేసి మాట 
మార్చేసింది.

బిగ్ బాస్ 3 నుండి తనను కావాలనే బయటకి పంపించేశారని ఈ షోలో ఉన్నది ఉన్నట్లుగా చూపించడం లేదని అన్నారు. లోపల ఒకటి జరిగితే బయట ఇంకొకటి ప్రసారం చేశారని విమర్శిస్తున్నారు. తొలివారంలో ఆరుగురు కంటెస్టంట్ లు నామినేట్ కాగా.. వారిలో అందరూ ఊహించినట్లు హేమ ఎలిమినేట్ అయ్యారు. సెల్ఫీ మూమెంట్ అనంతరంహౌస్ నుండి బయటకి వచ్చియన్ హేమ తన జర్నీకి సంబంధించిన ప్రోమోను చూస్తూ ఎమోషనల్ అయ్యారు.

వంటగది వల్లే గొడవలు వచ్చాయని.. అది తప్ప తనపై ఎలాంటి కంప్లైంట్స్ లేవని తెలిపారు. హౌస్ మేట్స్ అందరూ చాలా మంచివాళ్లని చెప్పింది. శ్రీముఖి, బాబా భాస్కర్ ఫైనల్స్ వరకు ఉండే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చింది. ఇలా అందరి గురించి పాజిటివ్ గా మాట్లాడిన హేమ.. బయటకి వచ్చి మాత్రం మాట మార్చేసింది. ఈ షోలో ఉన్నది ఉన్నట్లుగా చూపించడం లేదని.. ప్లాన్ వేసి తనను బయటకి పంపారని ఆరోపించారు. అక్కా.. అక్కా అంటూనే తనపై లేని పోని మాటలు చెప్పారని వాపోయారు.

హౌస్ లో గొడవ జరిగిన విధానానికి షోలో చూపించిన విధానానికి అసలు పొంతనే లేదని అన్నారు. హేమ ఎలిమినేట్ కావడంతో ఆమె స్థానాన్ని భర్తీ చేయడానికి ట్రాన్స్ జెండర్ తమన్నాసింహాద్రికి వైల్డ్ కార్డ్ స్వారా ప్రవేశం కల్పించారు.ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. ఈ క్రమంలో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఆమె ఎంట్రీ ఇస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఆసక్తి నెలకొంది!