విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై మిశ్రమ స్పందన వస్తోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితో ఆహా..ఒహో అంటూ గొప్పలు చెప్పుకుంటోంది. కొన్ని రాజకీయ పార్టీలు జగన్ నిర్ణయాలను స్వాగతిస్తుంటే మరికొన్ని రాజకీయ పార్టీలు కొందరు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

జగన్ పాలనపై మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌కు పలు సలహాలు సూచించారు. జగన్‌ ఆలోచనలు ఏమిటో తనకు తెలియడం లేదని స్పష్టం చేశారు.  

వైయస్ జగన్ ప్రభుత్వం అటు కేంద్రంతో సఖ్యతగా లేదని పోనీ విపక్షాలను సైతం కలుపుకుని వెళ్లడం లేదన్నారు. జగన్ నిర్ణయాలపై కాస్త స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు.  ఖర్చులు తగ్గించుకుని పొదుపుగా ప్రభుత్వాన్ని నడపాలని సూచించారు. అలా అయితేనే కొంతకాలం నడుస్తుందని లేదంటే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించారు కొణిజేటి రోశయ్య.