కేరళ: దళిత ఎమ్మెల్యే నిరసన తెలిపిన ప్రదేశాన్ని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు గోమూత్రంతో శుద్ధి చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. తిరువనంతపురం ప్రజాపన్నుల శాఖ కార్యాలయం దగ్గర దళిత మహిళా ఎమ్మెల్యే నిరసనకు దిగారు. 

మహిళా ఎమ్మెల్యే దీక్ష విరమించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమె నిరసన చేపట్టిన ప్రాంతంలో నీళ్లు చల్లి గోమూత్రంతో శుద్ధి చేశారు. 

తాను దీక్ష చేసిన చోట కాంగ్రెస్ పార్టీ యువన విభాగం కార్యకర్తలు గోమూత్రంతో శుద్ధి చేయడంపై ఆమె సీరియస్ అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే గీతా గోపి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అట్టడుగు వర్గాలపై విక్ష కొనసాగుతుందడానికి ఇదొక ఉదాహరణ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేరళలోని త్రిస్సూర్ జిల్లా నట్టిక నియోజకవర్గం నుంచి గెలుపొందారు గీతా గోపి. గత ఎన్నికల్లో సీపీఐ పార్టీ తరపున పోటీచేసి ఘన విజయం సాధించారు. అయితే తన నియోజకవర్గంలో రోడ్లు సరిగ్గా లేవంటూ ఆమె ప్రజా పనుల శాఖ కార్యాలయం ఎదుట నిరసనకు దిగింది.  

ఎమ్మెల్యే గీతాగోపి నిరసనతో దిగొచ్చిన అధికారులు రోడ్లు బాగుచేస్తామని హామీ ఇచ్చారు. దాంతో ఆమె దీక్ష విరమించి వెళ్లిపోయారు. ఆమె దీక్ష విరమించిన అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన యువజన విభాగం కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆమె కూర్చున్న ప్రదేశంలో నీళ్లు చల్లి గోమూత్రంతో శుద్ధి చేశారు. ఆమె ప్రజలను మోసం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తీరుపై ఎమ్మెల్యే గీతా గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని సీఎం విజయన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. 

ఇకపోతే కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యకర్తలు చేసిన పనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేరళ ప్రభుత్వంలోని మంత్రులు సైతం మండిపడ్డారు. గీతాగోపికి మద్దతు నిలిచారు. ఇలాంటి కార్యక్రమాలు సరికాదంటూ హెచ్చరించారు.