హైదరాబాద్: గ్రేటర్ కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన నేతల్లో మాజమంత్రి ముఖేష్ గౌడ్ ఒకరు. కాంగ్రెస్ పార్టీ కీలక నేత పి.జనార్థన్ రెడ్డి మరణానంతరం గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో ముఖేష్ గౌడ్ కీలక పాత్ర పోషించారు. మాజీమంత్రి ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి పార్టీని ముందుండి నడిపించారు.  

గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కువగా ఉండే వారు ముఖేష్ గౌడ్, దానం నాగేందర్. వీరిద్దరే గ్రేటర్ లో పార్టీని లీడ్ చేసేవారు. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మల్లా ఉన్న వీరిని హైదరాబాద్ బ్రదర్స్ అంటూ కూడా పిలిచేవారు కాంగ్రెస్ నేతలు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖేష్ గౌడ్, దానం నాగేందర్ లకు మంత్రి పదవులను సైతం కట్టబెట్టారు అప్పటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలిఅసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి పాలయ్యారు. 

2014 సాధారణ ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటమి పాలవ్వడంతో టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. కానీ ముఖేష్ గౌడ్ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే  కొనసాగారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆఫర్లు వచ్చినా కూడా ఆయన హస్తాన్ని వీడలేదు.  

2018 ముందస్తు ఎన్నికల్లో గోషామహాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముఖేష్ గౌడ్ క్యాన్సర్ వ్యాధిబారిన పడ్డారు. కనీసం ఎన్నికల ప్రచారంలో సైతం కనుగొనలేదు. వీల్ చైర్ పై వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా ఫ్రంట్ లౌన్ లో కుర్చునే ముఖేష్ గౌడ్ ఆ తర్వాత స్తబ్ధుగా ఉండిపోయారు. అనంతరం ఆయన క్యాన్సర్ వ్యాధిబారినపడటంతో సోమవారం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. 

ఈ వార్తలు కూడా చదవండి

దేవేందర్ గౌడ్ సమీప బంధువే ముఖేష్ గౌడ్

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూత