హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియలు సోమవారం నాడు పీవీఘాట్‌లో ముగిశాయి. అధికారిక లాంఛనాలతో రాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలను నిర్వహించింది.

ఆదివారం  తెల్లవారుజామున మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి  అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.సోమవారం నాడు ఉదయం జైపాల్ రెడ్డి నివాసం నుండి ఆయన పార్థీవదేహన్ని గాంధీభవన్‌కు తీసుకొచ్చారు. పార్టీ నేతల సందర్శనార్ధ: గాంధీభవన్‌లో జైపాల్ రెడ్డి పార్థీవ దేహాన్ని ఉంచారు.

గాంధీ భవన్ నుండి  పీవీ ఘాట్‌ వరకు అంతిమయాత్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్, ‌లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ మాజీ నేత మల్లిఖార్జున ఖర్గే, ,కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య, కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ తదితరులు కూడ జైపాల్  తెలంగాణకు చెందిన పలు పార్టీ నేతలు కూడ జైపాల్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు.

పార్టీ నేతలు, కుటుంసభ్యులు, సన్నిహితులు జైపాల్ రెడ్డిని కడసారి చూసేందుకు వచ్చారు. ఆశ్రునయనాలతో తమ ప్రియతమ నేతకు చివరిసారి వీడ్కోలు పలికారు.