కాపు కోటాపై చంద్రబాబుది పెద్ద తప్పు: జగన్

First Published 29, Jul 2019, 6:00 PM

కాపు రిజర్వేషన్లపై టీడీపీ సర్కార్ అవలంభించిన విధానాలపై  ఏపీ సీఎం వైఎస్ జగన్  విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ తీసుకొన్న నిర్ణయాల వల్లే  కాపులకు నష్టం వాట్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈబీసీ రిజర్వేషన్లను కులాల పరంగా విభజించే హక్కు లేదని కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం రిజర్వేషన్లు ఎలా ఇచ్చారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు

కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు తీసుకొన్న నిర్ణయాలు కాపుల ఆశలపై నీళ్లు చల్లారని ఆయన విమర్శించారు.

కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో అసెంబ్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాపు రిజర్వేషన్లు, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించారు.

కాపు రిజర్వేషన్ల అంశంపై జగన్ కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులతో చర్చించారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబునాయుడు ప్రభుత్వం రాజకీయలబ్ది కోసం వాడుకొందని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాల వల్ల కాపులు బీసీలా, కాదా అనే సందిగ్దం ఏర్పడిందని జగన్ అబిప్రాయ.పడ్డారు. కాపులను బీసీల్లో చేరుస్తూ 2017లో కేంద్రానికి చంద్రబాబు సర్కార్ తీర్మానం పంపిందన్నారు.

పేదరికం ప్రాతిపదికన ఓసీల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మరో వైపు ఈబీసీల్లో కూడ కాపులకు 5 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ చంద్రబాబు సర్కార్ తీర్మానం పంపిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ఈ విషయమై కేంద్రం చంద్రబాబు సర్కార్ ను వివరణ కోరిందని జగన్ గుర్తు చేశారు. కేంద్రం రాసిన లేఖకు చంద్రబాబు ప్రభుత్వం నుండి సమాధానం రాలేదని జగన్ గుర్తు చేశారు.

పేదరికం ప్రాతిపదికన ఓసీలకు 10 శాతం రిజర్వేషన్లలో కులాల వారీగా రిజర్వేషన్లు ఉండకూడదు. ఈ విషయం కేంద్రం స్పష్టం చేసిందని జగన్ తమ పార్టీ ప్రజా ప్రతినిధులకు చెప్పారు.

చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చడంపైనా ఈబీసీల్లో ఇచ్చిన 5 శాతం కోటాలపైనా కోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉన్నాయని జగన్ ప్రస్తావించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక అడుగు ముందుకు వేస్తే ఈ కోటా కింద సీట్లు, ఉద్యోగాలు పొందిన వారి పరిస్థితి ఏమౌతోందని ఆయన ప్రశ్నించారు.

ఈబీసీ కోటాలో చంద్రబాబు కాపులకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లు నిజమైతే వైద్య, పీజీ సీట్లలో రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదని జగన్ చంద్రబాబు సర్కార్ ను ప్రశ్నించారు.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో ఇదే విషయాన్ని పేర్కొందని ఆయన స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్ధకమైతే ఎవరు బాధ్యత వహిస్తారని జగన్ ప్రశ్నించారు. ఓసీ జనాభా లెక్కల ప్రకారంగా కాపు జనాభా 50 శాతం కన్నా ఎక్కువేనని జగన్ గుర్తు చేశారు.

కాపులకు 5 శాతానికి కట్టడి చేస్తే వారికి అన్యాయం జరగదా అని జగన్ ప్రశ్నించారు. కేంద్రం ఈబీసీలకు మార్గదర్శకాలు ప్రకటించిన వారంలోపుగానే మార్గదర్శకాలను ప్రకటించింది, అయితే ఆ తర్వాతే చంద్రబాబు మార్గదర్శకాల కోసం కమిటీని వేశారని జగన్ ఆరోపించారు.

ఈబీసీలకు కల్పించిన రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు చెప్పడం కాపులకు కల్పించిన ఆశల మీద నీళ్లు చల్లడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

loader