హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కన్నీళ్లు పెట్టుకొన్నారు. యడియూరప్ప బలపరీక్ష పూర్తైన తర్వాత రమేష్ కుమార్  జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సోమవారం నాడు హైద్రాబాద్ కు వచ్చారు.

ఎయిర్‌పోర్ట్ నుండి రమేష్ కుమార్  పీవీఘాట్ కు  చేరుకొన్నారు.  పీవీఘాట్‌లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పక్కనే రమేష్ కుమార్ కూర్చొన్నారు. కొద్దిసేపు కాంగ్రెస్ పార్టీ నేతలతో ముచ్చటించారు.

జైపాల్ రెడ్డి అంతిమయాత్ర సందర్భంగా కుటుంసభ్యులతో కలిసి కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ పాడె మోసారు. ఈ సమయంలో రమేష్ కుమార్  కన్నీళ్లు పెట్టుకొన్నారు.

జైపాల్ రెడ్డిని గుర్తు చేసుకొంటూ  కన్నీళ్లు ఆపుకొనే ప్రయత్నం చేశారు. రమేష్ కుమార్ తరచూ జైపాల్ రెడ్డిని కలిసేవాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.

బలవంతంగా కన్నీళ్లు ఆపుకొంటూ జైపాల్ రెడ్డి పాడె మోసారు రమేష్ కుమార్. జైపాల్ రెడ్డిని గుర్తుకు తెచ్చుకొని రమేష్ కుమార్  కంటతడి పెట్టుకొన్నారు. పాడె మోసిన తర్వాత కూడ రమేష్ కుమార్ ఆయనను పదే పదే గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు.