బిగ్ బాస్ సీజన్ 3 ఆసక్తికరంగా ముందుకు సాగుతోంది. షో మొదలై వారం రోజులు కావడంతో తొలివారంలో ఎలిమినేషన్ ఆసక్తిని క్రియేట్ చేసింది. స్ట్రాంగ్ కంటెస్టంట్ లు నామినేట్ కావడంతో షో నుండి ఎవరు బయటకి వెళ్లిపోతారో అనే టెన్షన్ ప్రేక్షకుల్లో కూడా క్రియేట్ అయింది. మొత్తానికి నామినేట్ అయిన ఆరుగురు కంటెస్టంట్ లలో హేమ ఎలిమినేట్ అయిందని చెప్పి సస్పెన్స్ కి తెర దించారు నాగార్జున.

ఇది ఇలా ఉండగా.. మరోపక్క సోషల్ మీడియాలో నటి శ్రీరెడ్డి.. నాగార్జునని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నాగార్జున గారికి తెలిసినన్ని పాలిటిక్స్ చంద్రబాబు గారికి కూడా తెలియవని.. డబ్బిస్తే బిగ్ బాస్ హీరో ఇవ్వకపోతే బిగ్ బాస్ గాడు ఒక ఎదవ అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది. గతంలో నాగార్జున తనకు బిగ్ బాస్ షో ఇష్టం లేదని చెప్పి సీజన్ 3 హోస్ట్ చేస్తుండడంతో సోషల్ మీడియాలో అతడిని ట్రోల్ చేశారు.

దానిపై నాగార్జున కూడా స్పందించిన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలానే ఇటీవల 'బిగ్ బాస్' పై వివాదం చెలరేగడం, దానిపై నాగార్జున స్పందించిన నేపథ్యంలో శ్రీరెడ్డి ఈ కామెంట్స్ చేసినట్లు స్పష్టమవుతోంది. నిజానికి శ్రీరెడ్డి 'బిగ్ బాస్' షోలోకి వచ్చే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరిగింది. పదిహేను మంది కంటెస్టంట్లలో ఆమె పేరు లేకపోవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.

కానీ ఈ వార్తల్లో నిజం లేదని శ్రీరెడ్డి పెట్టే పోస్ట్ లు బట్టి అర్ధమవుతోంది. నిజంగా ఆమె హౌస్ లోకి వెళ్లేదే అయితే ఇలాంటి వివాదాస్పద పోస్ట్ లు పెట్టేది కాదు.. ఈ లెక్కన చూసుకుంటే ఆమె హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ లేదని తెలుస్తోంది!