బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కి ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే బిగ్ బాస్ సీజన్ 2 ప్రసారమయిన సమయంలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయాలు ముందుగానే తెలిసిపోయేవి. దానికి మెయిన్ రీజన్ బిగ్ బాస్ హౌస్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయడమే.. శనివారం, ఆదివారం ఎపిసోడ్ లు కలిపి శనివారం నాడే షూట్ చేస్తారు. 

కానీ ఒకరోజు ఆలస్యంగా ప్రసారం చేస్తారు. దీంతో శనివారం నాడే హౌస్ మేట్ బయటకి రావడంతో లీకులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఈ విషయంపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది బిగ్ బాస్ టీమ్. ఎలాంటి లీకులు జరగకుండా ఎలిమినేట్ అయిన కంటెస్టంట్ ని ఆదివారం వరకు తమ కంట్రోల్ లోనే పెట్టుకొని ఆదివారం సాయంత్రం ఎలిమినేషన్ అనౌన్స్ చేసిన తరువాత కంటెస్టెంట్ ని బయటకి పంపిస్తున్నారట.

శనివారం నాడు షో పూర్తయిన వెంటనే కంటెస్టంట్ ముఖం మాస్క్ లతో కప్పి కారు ఎక్కించి.. అక్కడ నుండి హైదరాబాద్ లో స్టార్ హోటల్ కి తీసుకెళ్తారట. అక్కడే శనివారం నుండి ఆదివారం వరకు ఉండాల్సి ఉంటుందట. కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యులతో మాత్రం మాట్లాడే అనుమతి ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఆదివారం నాడు షో ప్రసారమైన తరువాత హోటల్ లో ఉంచిన కంటెస్టంట్ ని విడుదల చేస్తారట. షో నుండి ఎలాంటి లీకులు జరగక్కుండా ఉండాలని బిగ్ బాస్ టీమ్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇప్పటికే వారం రోజులు పూర్తి చేసుకున్న షో రెండో వారంలోకి అడుగుపెట్టింది.