మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి చివరి దశలో ఉంది. చిరు ఈ చిత్రంలో తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని భావిస్తున్నారు. రాంచరణ్ ఈ చిత్రానికి నిర్మాత. ఇదిలా ఉండగా చిరు, కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఈ చిత్రంలో నటించే హీరోయిన్ విషయంలో ఇప్పటికే లెక్కలేనన్ని వార్తలు బయటకు వచ్చాయి. చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. చిరు, కొరటాల చిత్రంలో అందాల చందమామ కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా ఫైనల్ చేశారంటూ తాజాగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. 

ఇదే కనుక జరిగితే కాజల్ రెండవసారి మెగాస్టార్ తో జట్టు కట్టినట్లు అవుతుంది. ఖైదీ నెం 150లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. కాగా చిరు కొరటాల చిత్రంలో నటించబోయే హీరోయిన్లు అంటూ అనుష్క, నయనతార, శృతి హాసన్, ఐశ్వర్యరాయ్ పేర్లు వినిపించాయి. కానీ చివరకు ఈ అవకాశం కాజల్ నే వరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ వేచి చూడాలి.