కాపు కోటా: చంద్రబాబుకు వైఎస్ జగన్ కౌంటర్ వ్యూహం

First Published Jul 29, 2019, 1:47 PM IST

కాపులకు రిజర్వేషన్ల అంశం ఏపీ రాజకీయాల్లో వేడిని పుట్టించింది. అధికార వైఎస్ఆర్‌సీపీ, విపక్ష టీడీపీలు ఈ విషయమై ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి.

కాపు రిజర్వేషన్ల అంశం ఏపీ రాజకీయాలను వేడెక్కించింది.ఈ అంశంపై టీడీపీ, వైసీపీలు తమ తమ వాదనలను విన్పిస్తున్నాయి. కాపు రిజర్వేషన్ల విషయంలో టీడీపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని వైఎస్ఆర్‌సీపీ భావిస్తోంది. చంద్రబాబు సర్కార్ హాయంలో చోటు చేసుకొన్న పరిణామాలను వైఎస్ఆర్‌సీపీ ముందుకు తెస్తోంది.

కాపు రిజర్వేషన్ల అంశం రాజకీయంగా ఆయా పార్టీలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. దీంతో ఈ విషయమై అధికార, విపక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.ఇందులో భాగంగానే కాపు రిజర్వేషన్ల అంశంపై టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలు అడుగులు వేస్తున్నాయి.

ఈ నెల 27వ తేదీన ఏపీ ప్రభుత్వం ఓ జీవోను జారీ చేసింది. ఆర్థిక వెనుకబడిన వారికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టుగా జీవోలో ప్రకటించారు. అయితే ఈ జీవోలో కాపుల అంశం లేదు.

ఈ విషయాన్ని టీడీపీ అస్త్రంగా మలుచుకొంది. అధికార వైఎస్ఆర్‌సీపీపై టీడీపీ విరుచుకుపడింది. కాపులకు జగన్ సర్కార్ అన్యాయం చేస్తోందని విమర్శలు గుప్పించింది.

ఈ తరుణంలో  రాజకీయంగా తమకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని వైఎస్ఆర్‌సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు భావించారు. సోమవారం ఉదయం అసెంబ్లీలోని తమ పార్టీ కార్యాలయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు.

కాపు రిజర్వేషన్ల అంశంపై చర్చించారు. ఈ సమావేశం నుండి కాపు ప్రజాప్రతినిధులు సీఎం జగన్ తో సమావేశమయ్యారు. కాపు రిజర్వేషన్ల అంశం గురించి చర్చించారు. కేంద్రం చట్టంతో పాటు పలు అంశాలను చర్చించేందుకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు,అవంతి శ్రీనివాస్‌లతో వైఎస్ జగన్ కమిటీని ఏర్పాటు చేశారు.

చంద్రబాబు సర్కార్ హాయంలో  చోటు చేసుకొన్న పరిణామాలపై కూడ జగన్ సర్కార్ ఆరా తీస్తోంది. కాపు రిజర్వేషన్ల అంశంపై ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖపై చంద్రబాబునాయుడు సర్కార్ ఎందుకు సమాధానం ఇవ్వలేదని వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

కాపులను బీసీలో చేర్చుతామని ఇచ్చిన హామీని వెనక్కు తీసుకొంటారా అని  కేంద్ర ప్రభతు్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ లేఖలో ప్రశ్నించింది.ఈ విషయమై చంద్రబాబు సర్కార్ సమాధానం ఇవ్వలేదు.

చంద్రబాబు సర్కార్ కేంద్రానికి ఎందుకు  సమాధానం ఇవ్వలేదనే విషయమై వైఎస్‌ఆర్‌సీపీ ఆరా తీస్తోంది. దీని వెనుక ఉన్న ఆంతర్యం గురించి త్రిసభ్య కమిటీ పరిశీలించనుంది.

కాపు రిజర్వేషన్ల అంశం రాజకీయంగా తమకు నష్టం వాటిల్లకుండా ఉండేలా త్రిసభ్య కమిటీ జగన్ సర్కార్ కు సూచనలు చేయనుంది. కాపులకు నష్టం కలగకుండా రాజకీయంగా ప్రత్యర్ధిగా ఉన్న టీడీపీపై  పైచేయి సాధించేలా నిర్ణయం ఉండాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?