కవలలకు జన్మనిచ్చిన బామ్మ: మరిన్ని వార్తలు

By Siva KodatiFirst Published Sep 5, 2019, 11:04 AM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

ఈటలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి ఆసక్తికర వ్యాఖ్యలు

మంత్రి ఈటల రాజేందర్ జాగ్రత్తగా మాట్లాడాలని నవ్వుతూ చెప్పినా కూడ రసమయి మాత్రం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.మెరిట్ ఉన్నవారే రాజకీయాల్లో ఉండాలి.... కానీ, మెరిట్ లేని వాళ్లు కూడ రాజకీయాల్లో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మంత్రి ఈటల రాజేందర్  కు తనకు నిజాలు మాత్రమే మాట్లాడడం వచ్చు... కడుపులో ఏమీ దాచుకోమన్నారు. అబద్దాలు మాట్లాడడం తమకు చేతకాదని ఆయన కుండబద్దలు కొట్టారు.

చింతమనేని కేసులో అలసత్వం: సీఐ సస్పెన్షన్, మరికొందరి పోలీసులపై వేటు..?

 చింతమనేని ప్రభాకర్ కేసు విషయంలో అలసత్వం వహించారని ఆరోపిస్తూ త్రిటౌన్ సీఐ మూర్తిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లపై కూడా వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

హర్భజన్-గిల్ క్రిస్ట్ ల మధ్య చిచ్చు రాజేసిన బుమ్రా హ్యాట్రిక్

ఎంకి పెళ్ళి  సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో. టీమిండియా యువ బౌలర్ బుమ్రా ఇటీవల సాధించిన హ్యాట్రిక్ సీనియర్ ఆటగాళ్లు హర్భజన్ సింగ్-గిల్ క్రిస్ట్ ల మధ్య చిచ్చు రాజేసింది.   

ఈ వయసులో పిల్లలు ఎంత వరకు కరెక్ట్..?

అకస్మాత్తుగా ఈ దంపతులకు ఏదైనా అయితే... ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి..? అమ్మ అవ్వాలనే కోరిక ఆమెకు బలంగా ఉండొచ్చు కానీ... ఈ వయసులో ఆ నిర్ణయం తీసుకోవడం మాత్రం చాలా తప్పు అంటున్నారు నెటిజన్లు.

ప్రియాంక కోసమే చంపాడు: టెక్కీ సతీష్ హత్యపై డీసీపీ

కూకట్‌పల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్ హత్య కేసులో అతని స్నేహితుడు హేమంత్‌ను అరెస్ట్ చేసినట్టుగా డీసీపీ వెంకటేశ్వరరావు  చెప్పారు.గురువారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియా సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన  వివరాలను మీడియాకు వివరించారు

ఒకే ఒక్కడు... అప్ఘాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ అద్భుత రికార్డు

అప్ఘానిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో  వేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయి టెస్ట్ ఫార్మాట్లో హేమాహేమీ క్రికెటర్లను సాధ్యం కాని రికార్డు రషీద్ సొంతమయ్యింది.  

సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్యే శ్రీదేవి: టీడీపీ నేతలపై ఫిర్యాదు

దళిత మహిళా ఎమ్మెల్యే అయిన శ్రీదేవిని అవమాన పరచిన వారిని ఎవరినీ వదలొద్దని హోంమంత్రి సుచరిత, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సీఎం జగన్ ను కోరారు. టీడీపీ నాయకులు కుల రాజకీయాలు చేస్తుంటే వర్ల రామయ్యలాంటి నేతలు వారిని ప్రోత్సహించడం సిగ్గు చేటని విమర్శించారు. 

పార్టీ మారుతున్నారంటూ ప్రచారం... స్పందించిన తోట నరసింహం

తొలుత తోట నరసింహం భార్య పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. తర్వాత ఆయన కూడా కమలం గూటికి చేరిపోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. కాగా...  ఈ వార్తలపై తాజాగా తోట నరసింహం స్పందించారు

చిదంబరానికి ఊరట:ఎయిర్‌సెల్ కేసులో బెయిల్ మంజూరు

 

మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ఆయన తనయుడు కార్తీ చిదంబరానికి సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఐఎఎక్స్ మీడియా కేసులో చిదంబరం అరెస్టయ్యాడు.

ఇంకా అజ్ఞాతంలోనే చింతమనేని ప్రభాకర్‌

చింతమనేనిని అదుపులోకి తీసుకునేందుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసిన పోలీసులు.. ఆయన కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏలూరు కోర్టులో చింతమనేని లొంగిపోతాడని ప్రచారం జరుగుతుండటంతో కోర్టు చుట్టూ మఫ్టీలో పోలీసులు మోహరించారు. 

గురువు పేరుతో స్కూల్ కట్టారు.. వైఎస్‌ను గుర్తుచేసుకున్న జగన్

తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురువుల పట్ల ఎంతో గౌరవంగా మెలిగేవారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. గురువు వెంకటప్పయ్య పేరుతో వైఎస్ పులివెందులలో స్కూల్‌ను స్థాపించారని జగన్ తెలిపారు. వైఎస్సార్ ఫౌండేషన్ ఇప్పటికీ ఆ స్కూలును నడుపుతోందన్నారు. 

తన ప్రేయసితో చనువుగా సతీష్: అందుకే హేమంత్ చంపేశాడు

కూకట్‌పల్లిలో టెక్కీ సతీష్ హత్య కేసును పోలీసులు చేధించారు.తన ప్రియురాలు సతీష్ తో  చనువుగా ఉండడం ఇష్టంలేకే హేమంత్ ఈ హత్య చేశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.గురువారం నాడు మధ్యాహ్నం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

 

టీటీడీ బోర్డు మెంబర్ రేసులో లేను: స్పష్టం చేసిన ద్వారంపూడి

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడి రేసులో తాను లేనని కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.రాష్ట్రం పీకల్లోతు ఆర్ధిక భారంతో ఉన్నప్పటికీ.. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో జగన్ ఇచ్చిన మాటపై నిలబడ్డారని చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. 

 

కొత్త కులాలు ఎస్టీల్లో చేర్చేందుకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు

బేడ, బుడిగ జంగాలు, ఎస్టీల్లో చేర్చే విషయమై అధ్యయనం చేసేందుకు ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జేపీ శర్మ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.

 

పవన్‌కు షాక్: వైఎస్ఆర్‌సీపీలోకి మాజీ మంత్రి బాలరాజు?

జనసేనకు మరో షాక్ తగలనుంది. మాజీ మంత్రి బాలరాజు వైఎస్ఆర్‌సీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

 

టీచర్స్ డే స్పెషల్ : ఉపాధ్యాయుడి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన రాధాకృష్ణన్

గురుపూజోత్సవం అంటే వెంటనే గుర్తొచ్చేది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. తను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించడమే కాకుండా స్వయంకృషితో పైకి ఎదిగి... ఉపాధ్యాయ వృత్తికే రాధాకృష్ణన్ మకుటంలా నిలిచారు. ఏ పనిలోైనా నిబద్ధత కలిగి ఉండాలని ఆయన జీవితం మనకు పాఠం చెబుతుంది

 

చీప్ పబ్లిసిటీ కోసం పాకులాట... పవన్ కి విజయసాయి రెడ్డి చురకలు

రాజధానిని మారుస్తున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో అక్కడ పవన్ పర్యటించి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు మద్దుతగా మాట్లాడారు. ఈ క్రమంలో సీఎం జగన్ పై విమర్శలు చేశారు. కాగా... జగన్ పై పవన్ చేసిన విమర్శలను తాజాగా విజయసాయి రెడ్డి తొప్పి కొట్టే ప్రయత్నం చేశారు.

 

బై బై గణేశా... నిమజ్జనాలు షురూ... నగరంలో సందడి హోరు

వినాయక చవితి రోజు నుంచి 9 రోజుల పాటు నిష్టగా పూజలు చేసి... ఆ తర్వాత అంతే వైభవంగా నిమజ్జనం చేస్తారు. అయితే... కొందరు మాత్రం మూడో రోజు నుంచే నిమజ్జన కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా హైదరాబాద్ నగరంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి రానుండటంతో రక్షణ ఏర్పాట్లలో తలమునకలయ్యారు.

 

బందరు పోర్టు ఒప్పందం రద్దు: హైకోర్టుకు నవయుగ

బందరు పోర్టు నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం చేసుకొన్నఒప్పందాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నవయుగ కంపెనీ గురువారం నాడు కోర్టును ఆశ్రయించింది.ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

 

05 సెప్టెంబర్ 2019 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి శ్రమలేని సంపాదనపై ఆలోచన. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని కష్టాలు. శ్రమలేని సంపాదనపై దృష్టి పెడతారు. క్రయ విక్రయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

 

నేడే జియో ఫైబర్ ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఇలా..

ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో బ్రాడ్ బాండ్ సేవల్లోకి అడుగిడే ముహూర్తం దగ్గర పడింది. గురువారం ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. జియో ఫైబర్ కనెక్షన్ పొందేందుకు వినియోగదారుల నుంచి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి.

 

హుజూర్ నగర్: బిజెపి అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి?

తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్న బిజెపి హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. హుజూర్ నగర్ సీటును తన వశం చేసుకునేందుకు బిజెపి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సీటు నుంచి కాంగ్రెసు నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీరెడ్డిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం

 

ఏపీలో ఇవాళ్టీ నుంచి కొత్త ఇసుక విధానం: నియమ, నిబంధనలివే

రాష్ట్రంలో గురువారం నుంచి కొత్త ఇసుక విధానం అమలు చేయబోతుండటంతో కొత్త విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇసుక విధానం అమలు, ధరల నిర్థారణ తదితర అంశాలపై వేరు వేరుగా జీవోలు జారీ చేసింది.

 

పాక్‌లో హిందూ యువతి ఘనత: పోలీస్ అధికారిగా ఎంపిక

సింధ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో పుఫ్ఫా కొల్హి అనే యువతి ఏఎస్సైగా ఎంపికైంది. దీంతో పాక్‌లో పోలీస్ అధికారిగా ఎంపికైన తొలి హిందూ యువతిగా ఆమె చోటు దక్కించుకుంది. సింధ్ ప్రావిన్స్‌లో పుఫ్ఫా కొల్హికి పోస్టింగ్ ఇచ్చినట్లు జియో న్యూస్ వెల్లడించింది. 

 

నాన్న ఎలా ఫీలయ్యేవారో: విహారి సెంచరీపై అతని సోదరి భావోద్వేగం

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో హనుమ విహారి సెంచరీ చేయడం పట్ల అతని సోదరి వైష్ణవి హర్షం వ్యక్తం చేశారు. నాన్నే బతికుంటే విహారి శతకం చూసి ఎంతో సంతోషపడేవారని ఆమె తెలిపారు. విండీస్‌పై విజయంలో బుమ్రా, విహారి కీలకపాత్ర పోషించారని వైష్ణవి పేర్కొన్నారు

 

టీడీపీ నేతల దూషణలతో ట్విస్ట్: చిక్కుల్లో వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి

వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తనంత తానుగా చిక్కులు కొని తెచ్చుకున్నట్లే కనిపిస్తున్నారు. టీడీపి నేతల అరెస్టు తర్వాత తాను చేసిన ప్రకటన ఆమెకు కష్టాలు తెచ్చే పెట్టే అవకాశాలున్నాయి.

 

పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. కేకు తిని తండ్రీకొడుకులు మృతి

పుట్టిన రోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఆనందంగా కేకు కట్ చేసుకొని ఒకరినోరు మరొకొరు తీపి చేసుకున్నారు. కానీ ఆ ఆనందం క్షణాలు కూడా మిగలలేదు. కేకు తిన్న కొద్దిసేపటికే ఇద్దరు మృత్యువాత  పడగా... మరో ఇద్దరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. ఈ విషాదకర సంఘటన సిద్ధిపేటలో చోటుచేసుకుంది.

 

వైఎస్ వివేకా హత్య: శ్రీనివాస్ రెడ్డి సూసైడ్ పై డీజీపీ ఆరా

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో బుధవారం నాడు సిట్ సభ్యులతో డీజీపీ గౌతం సవాంగ్ సుధీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.ఈ కేసులో నిందితులను త్వరగా పట్టుకొనేందుకు దర్యాప్తును వేగవంతం చేయాలని డీజీపీ ఆదేశించారు.

 

పావులు కదుపుతున్నారు: హరీష్ పై విజయశాంతి సంచలన ప్రకటన

ఈటల వివాదం, విష జ్వరాలతో ఇంత బీభత్సం జరుగుతున్నా హరీశ్ రావు మాత్రం సందట్లో సడేమియా అన్న చందంగా తాను ముఖ్యమంత్రి కావాలంటూ అనుచరులతో వెయ్యి కొబ్బరికాయలు కొట్టింది మొక్కులు చెల్లిస్తూ చాపకింద నీరులా పావులు కదుపుతున్న విషయం స్పష్టమైందన్నారు. 

 

దత్తాత్రేయ ఇంట్లో కత్తి కలకలం: భద్రత కట్టుదిట్టం, ఎలా వచ్చింది?

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్ గా నియమితులైన బండారు దత్తాత్రేయ నివాసంలో ఓ కత్తి కలకలం రేపింది. గవర్నర్ గా నియమితులైన దత్తాత్రేయను అభినందించేందుకు పలువురు ఆయన ఇంటికి వస్తున్నారు.ఈ సమయంలో ఈ కత్తిని బీజేపీ కార్యకర్తలు గుర్తించి భద్రతా సిబ్బందికి అప్పగించారు.

 

గుంటూరులో కవలలలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల బామ్మ

 

74 ఏళ్ల వయస్సులో ఓ మహిళ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. గుంటూరులోని ఓ నర్సింగ్‌హోమ్‌లో సిజేరియన్ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.

 

click me!