బేడ, బుడిగ జంగాలు, ఎస్టీల్లో చేర్చే విషయమై అధ్యయనం చేసేందుకు ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జేపీ శర్మ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. బెంతో ఒరియా కుల ధృవీకరణ పత్రాల జారీ అంశాన్ని కూడ ఈ కమిషన్ పరిశీలించనుంది. 

ఎన్నికల సమయంలో  వైఎస్ జగన్ ఇచ్చిన హమీ మేరకు బుడిగ జంగాలు, బేడ కులాలను ఎస్టీల్లో చేర్చే విషయాన్ని జగన్ సర్కార్ పరిశీలిస్తోంది. ఈ విషయమై ఏకసభ్య కమిషన్ ను నియమించింది.  ఈ కమిషన్‌కు విధి విధానాలను నిర్ణయిస్తూ జీవోను విడుదల చేశారు.