టీటీడీ బోర్డు మెంబర్ రేసులో లేను: స్పష్టం చేసిన ద్వారంపూడి
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడి రేసులో తాను లేనని కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.రాష్ట్రం పీకల్లోతు ఆర్ధిక భారంతో ఉన్నప్పటికీ.. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో జగన్ ఇచ్చిన మాటపై నిలబడ్డారని చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడి రేసులో తాను లేనని కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మాట తప్పడం, మడమ తిప్పడం తెలియని నాయకుడు వైఎస్ జగన్ దగ్గర తాను పనిచేస్తుండటం అదృష్టంగా భావిస్తున్నాని ఆయన తెలిపారు.
జగన్ 100 రోజుల పాలన ప్రజల ఆమోదం పొందిందని ద్వారంపూడి స్పష్టం చేశారు. రాష్ట్రం పీకల్లోతు ఆర్ధిక భారంతో ఉన్నప్పటికీ.. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో జగన్ ఇచ్చిన మాటపై నిలబడ్డారని చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.
విలీనం పేరుతో ఆంధ్రా బ్యాంక్ పేరు మార్చి తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బ తీయవద్దని ద్వారంపూడి కేంద్రప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు బుధవారం సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను 16 నుంచి 25కు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
దీంతో గతంలో ఉన్న ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి టీడీపీ పాలక మండలి 29కి చేరుతుంది. ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం అనంతరం నూతన పాలకమండలి ఏర్పాటు కానుంది.