టీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనం విష జ్వరాలతో బాధపడుతుంటే గులాబీ జెండాకు బాస్ ఎవరు అని ఒక వర్గం.. కేసీఆర్ తప్ప మరెవ్వరూ లేరని మరో వర్గం వాదించుకుంటూ ప్రజా సమస్యలను పక్కనబెట్టేశారని ఆమె ఎద్దేవా చేశారు.

పాలనలో తనకే ముందు చూపు ఉందని ప్రకటించుకునే కేసీఆర్.. విష జ్వరంలో ఎందుకు అప్రమత్తంగా వ్యవహరించలేదని రాములమ్మ ఫైరయ్యారు. ఆరోగ్య సమస్యలను చూపించి.. తనను బలిపశువును చేయాలనే కుట్ర జరుగుతోందని.. మంత్రి ఈటల సన్నిహితుల వద్ద వాపోయారని వార్తలు వస్తున్నాయని ఆమె తెలిపారు.

డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ జ్వరాలతో జనం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటే.. సీజనల్ వ్యాధులను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకుంటూ పరిస్ధితిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ విజయశాంతి ఆరోపించారు.

భాగ్యనగరంలో పారిశుద్ధ్య లోపం వల్లే విష జ్వరాలు ప్రబలుతున్నాయనే ఆమె ప్రస్తావించారు. జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సందర్భంగా మంత్రి ఈటల ఇదే అంశాన్ని ప్రస్తావించారని.. దీని వెనుక కారణం కూడా ఉందన్నారు. కేటీఆర్ కనుసన్నల్లోనే జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర మున్సిపల్ వ్యవస్థ పనిచేస్తోందంటూ విజయశాంతి ఆరోపించారు.

ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వివాదంలో తనను ఇరికించాలని చూస్తున్నారని... అయితే ఈ సమస్యను కేటీఆర్ మెడకు చుట్టాలని ఈటల భావిస్తున్నట్లు టీఆర్ఎస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారని రాములమ్మ తెలిపారు.

ఈటల వివాదం, విష జ్వరాలతో ఇంత బీభత్సం జరుగుతున్నా హరీశ్ రావు మాత్రం సందట్లో సడేమియా అన్న చందంగా తాను ముఖ్యమంత్రి కావాలంటూ అనుచరులతో వెయ్యి కొబ్బరికాయలు కొట్టింది మొక్కులు చెల్లిస్తూ చాపకింద నీరులా పావులు కదుపుతున్న విషయం స్పష్టమైందన్నారు.

బంగారు తెలంగాణ చేసి చూపుతామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అండ్ కో.. ఏ రకంగా అధికార దాహంతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారో.. ఇటీవల పరిణామాలు చూస్తే అర్ధమవుతుందంటూ విజయశాంతి అభిప్రాయపడ్డారు. 

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?
దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

ఎమ్మెల్సీగా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవం: మంత్రి పదవికి దక్కేనా?

ఈటల రాజేందర్ పై కేసీఆర్ వెనక్కి: మంత్రివర్గ విస్తరణపై సందేహాలు

ఈటల వ్యాఖ్యల్లో తప్పులేదు: ఎంపీ లక్ష్మీకాంతరావు బాసట

మంత్రి ఈటల రాజేందర్ సేఫ్: వెనక్కి తగ్గిన కేసీఆర్

ఈటలకు మంత్రి ఎర్రబెల్లి కౌంటర్: గులాబీ జెండా బాస్ కేసీఆర్

ఈటల రాజేందర్ ధిక్కార స్వరం: వేచి చూసే ధోరణిలో కేసీఆర్

టీఆర్ఎస్ లో ఓనర్ల చిచ్చు, ఈటలా! దమ్ముంటే బయటకు రా!!: బండి సంజయ్ సవాల్

ఇప్పటికైతే మౌనంగానే ఉంటా, కేసీఆర్ ను కలవను: ఈటల రాజేందర్

జూ.ఎన్టీఆర్ పార్ట్ టైమ్, హరీష్ ఫుల్ టైమ్: కేసీఆర్ కు అల్లుడి పోటు

కేటీఆర్ ఫోన్‌తో ఈటల తుస్సుమన్నారు: రేవంత్ రెడ్డి సెటైర్లు

తాజా ట్విస్ట్: ఈటల రాజేందర్ తో బీసీ సంఘాల భేటీ

భూమి కోసం వెళ్లా.. పార్టీ మారడానికి కాదు: వైఎస్‌తో భేటీపై ఈటల వివరణ

వ్యాఖ్యలపై కలకలం: ఈటెల రాజేందర్ యూటర్న్

కేసీఆర్‌కు షాక్: ఈటల సంచలన కామెంట్స్

ఈటల సంచలన వ్యాఖ్యలు: టీఆర్ఎస్‌లో ముసలం, కేటీఆర్‌కు ఎదురుతిరుగుతుందా..?