అమరావతి: బందరు పోర్టు నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం చేసుకొన్నఒప్పందాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నవయుగ కంపెనీ గురువారం నాడు కోర్టును ఆశ్రయించింది.ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈ నెల 12వ తేదీన విచారణ చేయనున్నట్టుగా ప్రకటించింది. పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో కూడ జలవిద్యుత్ ప్రాజెక్టు పనుల ఒప్పందాన్ని రద్దు చేయడంతో నవయుగ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. నవయుగ కంపెనీకి అనుకూలంగా హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయమై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.

 బందరు పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించిన  412.5 ఎకరాల భూమిని వెనక్కీ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు బుధవారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. 

బందరు పోర్ట్ నిర్మాణ పనులను అప్పటి ప్రభుత్వం నవయుగ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొంది. పనులు ప్రారంభించకపోవడంతో ఒప్పందాన్ని రద్దు చేసింది. అంతేకాదు పోర్టుకు కేటాయించిన 412.5 ఎకరాల  భూమిని వెనక్కు తీసుకోవాలని కూడ నిర్ణయం తీసుకొన్నారు.

బందరు పోర్టు నిర్మాణం కోసం నవయుగ సంస్థ లీడ్ ప్రమోటర్ గా మచిలీపట్నం పోర్టు లిమిటెడ్ తో చేసుకొన్న ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకొంది. ఈ మేరకు ఈ ఏడాది ఆగష్టు 8వ తేదీన ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బందరు పోర్టు నిర్మాణం కోసం గత 11 ఏళ్లుగా కన్సార్టియం శ్రద్ద చూపించలేదని ప్రభుత్వం  భావిస్తోంది. గడువు పెంచినా కూడ  పట్టించుకోలేదు. అని జీవోలో పేర్కొంది. దశాబ్దకాలంగా పోర్టు పనులు ప్రారంభించినా కూడ పనులు ప్రారంభించకపోవడంతో  కలిగిన నష్టాన్ని కూడ వసూలు చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని ఆ జీవోలో పేర్కొంది.


సంబంధిత వార్తలు

బందరు పోర్టు: చంద్రబాబుకు షాక్, జగన్‌కు జై కొట్టిన కేశినేని

బందరు పోర్టుని ఎంతకు అమ్మేశారు... జగన్ ప్రభుత్వంపై దేవినేని ప్రశ్నలు

విషయం తెలీకుండా మాట్లాడుతున్నావు.. లోకేష్ పై మండిపడ్డ విజయసాయి