Asianet News TeluguAsianet News Telugu

ప్రియాంక కోసమే చంపాడు: టెక్కీ సతీష్ హత్యపై డీసీపీ

కూకట్‌పల్లిలో టెక్కీ సతీష్ హత్య కేసులో హేమంత్ ప్రధాన నిందితుడుగా పోలీసులు తేల్చారు. ప్రియాంక కోసమే ఈ హత్య చేశాడని పోలీసులు  స్పష్టం చేశారు.

cp venkateshwar rao reveals techie satish  murder case details
Author
Hyderabad, First Published Sep 5, 2019, 4:00 PM IST


హైదరాబాద్: కూకట్‌పల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్ హత్య కేసులో అతని స్నేహితుడు హేమంత్‌ను అరెస్ట్ చేసినట్టుగా డీసీపీ వెంకటేశ్వరరావు  చెప్పారు.

గురువారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియా సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన  వివరాలను మీడియాకు వివరించారు.పదేళ్ల క్రితం సతీష్ సాఫ్ట్‌వేర్ స్కిల్స్‌ను నేర్పేందుకు ఓ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేశారు. మరో సంస్థను కూడ ఆయన ఏర్పాటు చేశాడు.

2016లో హేమంత్‌కు తన కంపెనీలో అడ్మినిస్ట్రేటర్ గా నియమించుకొన్నాడు. 2017లో  సతీష్  మరొకందరితో కలిసి మరో కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీలో హేమంత్ కూడ రూ. 3 లక్షలు పెట్టి భాగస్వామిగా చేరాడు.అదే సమయంలో విజయవాడకు ప్రియాంక అనే యువతి ఈ సంస్థలో చేరినట్టుగా డీసీపీ చెప్పారు.

ప్రియాంకతో హేమంత్‌కు మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. హేమంత్ కు పెళ్లైన తర్వాత కూడ ప్రియాంక విషయం  తెలిసి హేమంత్ తో ఆయన భార్య దూరంగా ఉంటుంది.

ప్రియాంక, హేమంత్ మధ్య సాన్నిహిత్యం ఉన్న విషయాన్ని ఇటీవలనే సతీష్ గుర్తించాడు. కేపీహెచ్‌బీ లోని సాఫ్ట్‌వేర్ కంపెనీ నష్టపోవడానికి కారణమని హేమంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ప్రియాంక, హేమంత్ లు ఒకే ఇంట్లో ఉన్న విషయాన్ని తెలుసుకొని వారిద్దరిని వేరుగా ఉండాలని హేమంత్ ను సతీష్ హెచ్చరించాడు.ప్రియాంకను హస్టల్ కు పంపాలని.... వేరే రూమ్‌లోకి మారాలని హేమంత్ కుసతీష్ సూచించాడు. తనకు ప్రియాంకను దూరం చేస్తున్నాడని హేమంత్ కక్ష కట్టాడు.

ఆగష్టు 27వ తేదీన హేమంత్ సతీష్ కు ఫోన్ చేసి తన ఇంటికి పిలిపించాడు. మద్యం మత్తులో సతీష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టుగా నమ్మించేలా ప్లాన్ చేశాడు.ఈ మేరకు ఓ కారును అద్దెకు కూడ తీసుకొన్నాడు. 

సతీష్ తన ఇంటికి వచ్చిన తర్వాత మద్యం తాగిన తర్వాత వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.  చిన్న గొడవకు సతీష్ తల మీద రాడ్‌తో హేమంత్ కొట్టాడు. మృతదేహన్ని వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించాడు.

కానీ సతీష్ మృతదేహం చాలా బరువుగా ఉండడంతో  తరలించలేకపోయాడు. ప్రియాంక విషయమై కక్ష పెట్టుకొని హేమంత్  సతీష్ ను హత్య చేసినట్టుగా తమ దర్యాప్తులో తేలిందని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు.

ఈ హత్య ప్లాన్ ప్రియాంకకు ముందే తెలియదని ఇప్పటివరకు తమ దర్యాప్తులో తేలిందన్నారు. అయితే ఈ కేసులో తన ప్రమేయం లేదని నమ్మించేందుకు హేమంత్  సతీష్ కోసం వెతికేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా ఆయన తెలిపారు.  ఆ తర్వాత ఆయన  పారిపోయినట్టుగా ఆయన తెలిపారు.

    సంబంధిత వార్తలు

తన ప్రేయసితో చనువుగా సతీష్: అందుకే హేమంత్ చంపేశాడు

హేమంత్ ఒక్కడి పని కాదు: టెక్కీ సతీష్ భార్య ప్రశాంతి

టెక్కీ సతీష్ హత్య: పోలీసుల అదుపులో హేమంత్, కారణమదేనా?

టెక్కీ సతీశ్ హత్య: వీడని చిక్కుముడులు, మరిన్ని ట్విస్టులు

టెక్కీ సతీష్ హత్య కేసులో ట్విస్ట్: అక్రమ సంబంధమే కారణం

కేపీహెచ్‌బీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణహత్య

Follow Us:
Download App:
  • android
  • ios