రాష్ట్రంలో గురువారం నుంచి కొత్త ఇసుక విధానం అమలు చేయబోతుండటంతో కొత్త విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇసుక విధానం అమలు, ధరల నిర్థారణ తదితర అంశాలపై వేరు వేరుగా జీవోలు జారీ చేసింది. 1966 చట్టంలోని సవరణలు, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలపై ఈ జీవోలు విడుదలయ్యాయి.

టన్ను ఇసుక ధరను రూ.375గా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. నగదు చెల్లింపును ఆన్‌లైన్‌లోనే చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇసుక రవాణా ఛార్జీలను నిర్ణయించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.

ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఇసుకను రీచ్‌ల నుంచి స్టాక్ మార్డులకు తరలించి అమ్మకాలు జరపనున్నారు. దీనిలో భాగంగా 102 ఇసుక రీచ్‌లను ప్రభుత్వం గుర్తించింది.  జీపీఎస్ లేకుండా ఇసుక తరలిస్తే భారీ జరిమానాలు విధించనున్నారు.

ఏపీ దాటి ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇసుక రీచ్‌లు, స్టాక్ యార్డుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రిజర్వాయర్ల వద్ద జలవనరుల శాఖకు, పట్టా భూముల్లో తహసీల్దార్లకు ఇసుక తవ్వకాల బాధ్యతను అప్పగించారు.

సెప్టెంబర్ 5 నుంచి రాష్ట్రంలో కొత్త ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నట్లు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే.
జగన్ సంచలన నిర్ణయం: ఇసుక రవాణా టెండర్లు రద్దు

సంపాదన పోతుందనే ఆందోళనలు: టీడీపీ నిరసనలపై బొత్స విసుర్లు

ఇసుక నదిలో లేదు, వారి పొట్టలో ఉంది: వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు