కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో బుధవారం నాడు సిట్ సభ్యులతో డీజీపీ గౌతం సవాంగ్ సుధీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.ఈ కేసులో నిందితులను త్వరగా పట్టుకొనేందుకు దర్యాప్తును వేగవంతం చేయాలని డీజీపీ ఆదేశించారు.

బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు డీజీపీ చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సిట్ తో పాటు ప్రస్తుత సిట్ సభ్యులతో సమావేశమయ్యారు. 

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఏడుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 33 మందితో సిట్ వేశారు. ఈ కేసుకు సంబంధించి డీజీపీ సమాచారాన్ని ఆరా తీశారు. శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకొంటాడని ఎందుకు పసిగట్టలేకపోయారని ఆయన ప్రశ్నించారు. అనుమానితులపై ఇలాగే వ్యవహరిస్తారా అని ఆయన ప్రశ్నించినట్టుగా సమాచారం.

ఈ ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలు, వివేకా హత్య వెనుక ఉన్న కారణాల గురించి సిట్ బృందం సభ్యులను ఆయన ప్రశ్నించారు. పులివెందులతో పాటు సింహాద్రిపురంలో కూడ విచారణ జరపాలని డీజీపీ సిట్ బృందాన్ని ఆదేశించారు.

సిట్ బృందంతో సమీక్ష ముగిసిన తర్వాత డీజీపీ పులివెందులలో వైఎస వివేకానందరెడ్డి ఇంటిని పరిశీలించారు. హత్య తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలను వివేకా కుటుంబసభ్యులను ఆయన అడిగి తెలుసుకొన్నారు.

సంబంధిత వార్తలు

సూసైడ్‌నోట్‌లో రెండు చేతిరాతలేంటి.. శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యపై బాబు అనుమానాలు

అన్ని బయటకొస్తాయి: వివేకా హత్య కేసుపై శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

నా ఇంట్లో 9 లక్షలు ఇవ్వండి..సూసైడ్ నోట్‌లో భాస్కర్ రెడ్డిని కోరిన శ్రీనివాస్ రెడ్డి

వైఎస్ వివేకా హత్య కేసు:జగన్ కు శ్రీనివాస్ రెడ్డి రాసిన లేఖ ఇదీ...

వైఎస్ వివేకా హత్య: శ్రీనివాస్ రెడ్డి సూసైడ్‌ నోట్ ఫోరెన్సిక్‌కు, కడపకు డీజీ

వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడి ఆత్మహత్య: ఉత్పన్నమవుతున్న ప్రశ్నలివీ...

వైఎస్ వివేకా హత్య: శ్రీనివాస్ రెడ్డి సూసైడ్, పోలీసుల అనుమానాలివి

వైఎస్ వివేకానందరెడ్డి హత్య: అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డి సూసైడ్