చింతమనేని కేసులో అలసత్వం: సీఐ సస్పెన్షన్, మరికొందరి పోలీసులపై వేటు..?
ఈ కేసులో పోలీసుల అలసత్వం ఉందంటూ ఆయన మండిపడ్డారు. చింతమనేని ప్రభాకర్ కేసు విషయంలో అలసత్వం వహించారని ఆరోపిస్తూ త్రిటౌన్ సీఐ మూర్తిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లపై కూడా వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏలూరు: దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కేసుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏలూరు రేంజ్ డీఐజీ ఏకే ఖాన్. చింతమనేని ప్రభాకర్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరగడంతోపాటు బాధితులపై బెదిరింపులు ఘటనపై డీఐజీ ఏకే ఖాన్ ఆరా తీశారు.
ఈ కేసులో పోలీసుల అలసత్వం ఉందంటూ ఆయన మండిపడ్డారు. చింతమనేని ప్రభాకర్ కేసు విషయంలో అలసత్వం వహించారని ఆరోపిస్తూ త్రిటౌన్ సీఐ మూర్తిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లపై కూడా వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చింతమనేనిని అదుపులోకి తీసుకునేందుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ.
చింతమనేని ప్రభాకర్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. ఏలూరు కోర్టులో చింతమనేని ప్రభాకర్ లొంగిపోతాడని ప్రచారం జరుగుతుండటంతో కోర్టు చుట్టూ మఫ్టీలో పోలీసులు మోహరించారు. అంతేకాదు ఇప్పటికే దుగ్గిరాలలోని చింతమనేని ఇంటికి పోలీసులు నోటీసులు సైతం అంటించారు.
ఇదిలా ఉంటే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పై ఫిర్యాదులు చేసేందుకు బాధితులు ఎస్పీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చింతమనేని తమపై దాడులకు పాల్పడ్డారని బాధితులు జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ కు ఫిర్యాదు చేశారు.
గతంలో తమ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఆ కేసులపై సత్వరమే విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. బాధితుల ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ చట్టప్రకారం రీ ఎంక్వయిరీ చేపడతామని హామీ ఇచ్చారు.
విచారణను వేగవంతం చేస్తామని తెలిపారు. బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చింతమనేనిపై 20 ఏళ్ల నుంచి 50 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఆ కేసులలో ఎక్కువగా పోలీసులపై దాడులు, ఎస్సీ, ఎస్టీ కేసులే ఉన్నాయని ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఇంకా అజ్ఞాతంలోనే చింతమనేని ప్రభాకర్
అజ్ఞాతంలోకి మాజీ ఎమ్మెల్యే చింతమనేని
పోలవరం పైపులు చోరీ చేశాడు:చింతమనేనిపై పోలీసులకు ఫిర్యాదు
ఇసుక కొరతపై ఆందోళన... చింతమనేని గృహ నిర్భందం
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసు