తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
12:02 AM (IST) May 27
Shubman Gill: కోహ్లీ, రోహిత్, అశ్విన్ లేకుండా శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో టీమిండియా ఇంగ్లాండ్ టెస్ట్ పర్యటనకు వెళ్లనుంది. కొత్త WTC సైకిల్‌ను బలంగా ప్రారంభించడానికి కీలకమైన సిరీస్. మరి గిల్ కెప్టెన్సీలో టీమిండియా టెస్టు సిరీస్ గెలుస్తుందా?
11:35 PM (IST) May 26
IPL 2025 PBKS vs MI: ముందు బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ లో అదరగొడుతూ ఐపీఎల్ 2025లో తమ చివరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ను ఓడించింది. దీంతో ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ టాప్-2 లోకి చేరింది.
10:27 PM (IST) May 26
Telangana rains: తెలంగాణలో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణం కంటే ముందుగానే నైరుతి రుతుపవనాల రాకతో వచ్చే నాలుగు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది.
10:23 PM (IST) May 26
వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న బాలయ్య.. డబుల్ హ్యాట్రిక్ పై కన్నేశారు. ఈక్రమంలో తనకు వీర సింహారెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన మలినేని గోపీచంద్ కు మరో అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
09:37 PM (IST) May 26
బెంగళూరులో ఒక ఆవిడ ఉబర్ బుక్ చేస్తే ఆమె బాస్ డ్రైవర్ గా వచ్చాడట! ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
09:32 PM (IST) May 26
ACB summons BRS leader KTR: ఫార్ములా ఈ కారు రేసు ఈవెంట్‌లో అవకతవకలపై కేసులో విచారణకు హాజరుకావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) కు ఏసీబీ మరోసారి నోటీసులు పంపింది.
09:24 PM (IST) May 26
కెనడా ఇండియా ఫౌండేషన్ బహూకరించే గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును సద్గురు అందుకున్నారు. కాన్షియస్ ప్లానెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.
08:39 PM (IST) May 26
heavy rain in Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మే 30 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
08:09 PM (IST) May 26
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల యాజమాన్య సమస్యలు, వివాదంపై నిర్మాతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఈ వివాదంలో తమ పాత్రలపై వస్తున్న ఆరోపణలపై స్పష్టతనిస్తున్నారు. ఇక ఈ విషయంలో తాజాగా కౌంటర్ ట్వీట్ చేశారు నిర్మాత , నటుడు బండ్ల గణేష్.
08:00 PM (IST) May 26
ఏదయినా ట్రిప్ కు వెళ్లినపుడు అక్కడి అందాలు మనల్ని ఆకట్టుకుంటాయి… కానీ అవే మన కడుపు నింపవు. కాబట్టి ప్రయాణ సమయంలో మంచి అహారాన్ని కనుగొనడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
07:17 PM (IST) May 26
PBKS vs MI IPL 2025: ఐపీఎల్ 2025లో టాప్-2 ఫినిష్ కోసం పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ లో టాప్ ప్లేస్ ను దక్కించుకునే అవకాశముంది.
06:17 PM (IST) May 26
IPL 2025 PBKS vs MI: ముంబై ఇండియన్స్ తో జరిగే కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయర్లు చాహల్, మార్కో జాన్సన్ ఆడటంపై స్పష్టత లేదు.
05:40 PM (IST) May 26
Sourav Gangulys: పూరీ సముద్ర తీరంలో వాటర్ స్పోర్ట్స్ సమయంలో జరిగిన పడవ ప్రమాదంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కుటుంబం కూడా ఉంది.
05:23 PM (IST) May 26
దేశానికి అధ్యక్షుడైతే ఏంటి… ఆ భార్యకు మాత్రం సాధారణ భర్తే. అందుకే అందరు ఆడవారిలా తన కోపాన్ని భర్తపై ప్రదర్శించింది. ఇలా ఓ దేశాధ్యక్షుడైన భర్తను భార్య కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
04:59 PM (IST) May 26
ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని కరుణానిధి మద్దతు ఇచ్చారు. కానీ స్టాలిన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అని చెన్నైలో ఏపీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
04:49 PM (IST) May 26
IPL 2025 MI vs PBKS: ఐపీఎల్ 2025లో టాప్ ప్లేస్ దక్కించుకోవడానికి పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ కీలకపోరుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ బిగ్ మ్యాచ్ కు ముందు పంజాబ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ఆడటంపై సందేహాలు నెలకున్నాయి.
04:43 PM (IST) May 26
భారత్‌లో కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకువస్తూ చాలా వేగంగా వ్యాపిస్తున్నాయని కొన్ని వ్యాక్సిన్లకు కూడా లొంగడంలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
04:24 PM (IST) May 26
డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో దానిని సరిగ్గా ప్లానింగ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతుంటారు. వచ్చేది తక్కువ జీతమైనా సరే సరిగ్గా కేటాయింపులు చేసుకుంటే ఫ్యూచర్ బిందాస్‌గా ఉంటుంది.
03:58 PM (IST) May 26
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం డిల్లీలోనే ఉండటం, కాంగ్రెస్ పెద్దలను కలుస్తుండటంతో మరోసారి మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మంత్రులుగా ఎవరికి అవకాశం దక్కవచ్చంటే…
03:46 PM (IST) May 26
ఐపీఎల్ 2025లో టాప్ 2 స్థానాల్లో నిలవడమే లక్ష్యంగా.. ముందుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్‌తో ముంబయి ఇండియన్స్ సోమవారం (మే 26) పోటీలో తలపడుతోంది.
02:12 PM (IST) May 26
బీపీ తగ్గించుకోవడానికి చాలా మంది మాత్రలు, వ్యాయామాలు వంటి ఎన్నో ప్రయత్నిస్తారు. కానీ, మనం రోజూ తినే కొన్ని ఆహారాలతో సులభంగా బీపీని తగ్గించుకోవచ్చు.
01:49 PM (IST) May 26
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల తర్వాత మొదటిసారి సొంత రాష్ట్రానికి వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. వడోదరలో రోడ్ షో నిర్వహించగా కల్నల్ సోఫియా ఖురేషీ ఫ్యామిలీతో కలిసి స్వాగతం పలికారు.
01:01 PM (IST) May 26
ఇప్పటికే పలుదేశాల్లో కరోనా కేసులు అమాంతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు భారతదేశంలో కూడా కరోనా మళ్లీ మెళ్ళిగా చాపకిందనీరుగా విస్తరిస్తుండటం మరింత ఆందోళనకరం. మే 26 ఉదయం 8:00 గంటల నాటికి దేశంలో కరోనా కేసులెన్నంటే…
12:58 PM (IST) May 26
డెవలపర్‌ను బెదిరించిన ఏఐ క్లాడ్ ఒపస్ 4.. భవిష్యత్తులో తనను రీప్లేస్ చేస్తే రహస్యాలను బహిర్గతం చేస్తానని హెచ్చరిక.
12:58 PM (IST) May 26
పెళ్లి చేసుకోవాలంటే లక్షల్లో ఖర్చవుతుందని తెలిసిందే. అయితే ఒక దేశంలో మాత్రం పెళ్లి చేసుకుంటే రిటర్న్ గా డబ్బులు ఇస్తున్నారు. ఇంతకీ ఏంటా దేశం.? ఎందుకు డబ్బులు ఇస్తున్నారు.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
12:24 PM (IST) May 26
మీ ఇన్‌స్టాగ్రామ్‌ని ప్రైవేట్‌గా మార్చకుండానే సురక్షితంగా ఉంచుకోండి. హ్యాకింగ్, స్పామ్, అవాంఛిత ఇంటరాక్షన్ల నుంచి మీ పబ్లిక్ ప్రొఫైల్‌ని రక్షించుకోవడానికి ఐదు కీలక సెట్టింగ్‌లు చేసుకుంటే సరిపోతుంది.
12:17 PM (IST) May 26
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు మద్దతుగా నిలిచిన తుర్కియేపై భారత్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ఎర్డోగాన్-షరీఫ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
11:50 AM (IST) May 26
ప్రజల్లో పవన్ కల్యాణ్ కు రోజురోజుకు ఆదరణ పెరిగిపోతోంది. ఇది తన కొడుకు లోకేష్ కు ఎక్కడ ఇబ్బందులు తెచ్చిపెడుతుందోనని ఆందోళన చెందుతున్నారో ఏమోగానీ చంద్రబాబు నాయుడు ఓ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అది కడప మహానాడులో బైటపెట్టనున్నారట…
11:33 AM (IST) May 26
10:57 AM (IST) May 26
ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ ఓయోకు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్‌లో స్టార్టప్ కంపెనీగా మొదలైన ఓయో ఇప్పుడు ఇతర దేశాల్లోని విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
10:01 AM (IST) May 26
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర, కర్నాటకలో ఇద్దరు మృతులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
09:51 AM (IST) May 26
మరికొద్దిరోజుల్లో వేసవి సెలవులు ముగియనున్నాయి. అంతకంటే ముందే మీ పిల్లలతో సరదాగా హాలిడే ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇదే మీకు అద్భుత అవకాశం…
09:28 AM (IST) May 26
హార్వర్డ్ యూనివర్సిటీలో 31% విదేశీ విద్యార్థులు ఉండటంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. యూదు వ్యతిరేకతను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
08:42 AM (IST) May 26
ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి చేయగా, పుతిన్ తీరుపై ట్రంప్ మండిపడ్డారు. ఇది రష్యా పతనానికి దారితీస్తుందన్నారు.
08:09 AM (IST) May 26
నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనాలు, ద్రోణి ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో మూడ్రోజులు ఈ వర్షాలు కొనసాగుతాయని… దక్షిణాది రాష్ట్రాల్లో అయితే కుండపోత వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.