ఇప్పటికే పలుదేశాల్లో కరోనా కేసులు అమాంతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు భారతదేశంలో కూడా కరోనా మళ్లీ మెళ్ళిగా చాపకిందనీరుగా విస్తరిస్తుండటం మరింత ఆందోళనకరం. మే 26 ఉదయం 8:00 గంటల నాటికి దేశంలో కరోనా కేసులెన్నంటే…

మరోసారి కరోనా మహమ్మారి కోరలుచాస్తోంది. ప్రపంచంలో పలు దేశాల్లో ఇప్పటికే భారీగా కేసులు బైటపడగా తాజాగా భారతదేశంలోనూ కోవిడ్-19 విజృంభిస్తోంది. తాజాగా కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు కరోనా కారణంగా ప్రాణాలు విడిచాడు. మహారాష్ట్రలోని థానే 21 ఏళ్ల యువకుడు కరోనాతో బాధపడుతూ మరణించాడు.

ఇక మే 26 అంటే సోమవారం ఉదయం 8:00 గంటల నాటికి భారతదేశంలో 1,009 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాతావరణ పరిస్థితుల మార్పుతో పాటు కరోనా కొత్త వేరియంట్స్ పుట్టుకురావడంతో దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని… ముందుజాగ్రత్తగా మళ్లీ మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని సూచిస్తున్నారు. 

కరోనా వ్యాప్తి ఉత్తరాది రాష్ట్రాలకంటే దక్షిణాదిలోనే ఎక్కువగా ఉంది. అత్యధికంగా కేరళలో 273 కేసులున్నాయి. ఇక తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ రాజధాని డిల్లీలో 23 యాక్టివ్ కేసులున్నాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్కటిగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి.