MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Holidays : జూన్ ఫస్ట్ వీక్ లో లాంగ్ వీకెండ్స్ .. స్కూల్స్ మొదలయ్యే ముందు మీ పిల్లలతో ట్రిప్ ప్లాన్ చేసుకొండి

Holidays : జూన్ ఫస్ట్ వీక్ లో లాంగ్ వీకెండ్స్ .. స్కూల్స్ మొదలయ్యే ముందు మీ పిల్లలతో ట్రిప్ ప్లాన్ చేసుకొండి

మరికొద్దిరోజుల్లో వేసవి సెలవులు ముగియనున్నాయి. అంతకంటే ముందే మీ పిల్లలతో సరదాగా హాలిడే ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇదే మీకు అద్భుత అవకాశం… 

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 26 2025, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మీ పిల్లలతో హాయిగా ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా?
Image Credit : iSTOCK

మీ పిల్లలతో హాయిగా ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా?

Holidays : స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. ఇంతకాలం ఎండలు మండిపోవడంతో సెలవులున్నా పిల్లలను బయటకు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు వెనకడుగు వేసారు. కానీ ఇప్పుడు వాతావరణం పూర్తిగా చల్లబడింది... దీనికి తోడు వచ్చేనెల ఆరంభంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులకు కూడా సెలవు ఉంది. ఈ సెలవు ఆదివారంతో కలిసి వస్తుండటంతో లాంగ్ వీకెండ్ గా మారింది. కాబట్టి పిల్లలను సరదాగా బయటకు తీసుకువెళ్ళాలనుకునే పేరెంట్స్ కి ఇది అద్భుత అవకాశం.

26
పిల్లలతో సరదాగా గడిపేందుకు ఇదే పర్ఫెక్ట్ టైమ్
Image Credit : Getty

పిల్లలతో సరదాగా గడిపేందుకు ఇదే పర్ఫెక్ట్ టైమ్

ఏప్రిల్ 24న ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు సెలవులు మొదలయ్యాయి. అప్పట్నుంచి ఎండలే ఎండలు... ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఈ ఎండల్లో పిల్లలను సరదాగా ట్రిప్ కు తీసుకెళ్లడం మాట అటుంచి కనీసం ఇంట్లోంచి కాలు బైటపెట్టనివ్వలేదు పేరెంట్స్... ఇప్పటివరకు ఇలాగే గడిచిపోయింది. అయితే జూన్ లో స్కూల్స్ ప్రారంభంకానున్నాయి.. కాబట్టి ఆలోపు పిల్లలతో ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసే పేరెంట్స్ కు జూన్ ఫస్ట్ వీక్ కలిసివస్తోంది.

Related Articles

Related image1
Holidays : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే సమాచారం.. సమ్మర్ హాలిడేస్ ముగిసాక కూడా మరో 100 రోజుల సెలవులు
Related image2
School Holidays : జూన్ సగం వేసవి సెలవులే.. మిగతా రోజుల్లో వచ్చే హాలిడేస్ ఇవే
36
జూన్ ఫస్ట్ వీక్ సెలవులే సెలవులు
Image Credit : Getty

జూన్ ఫస్ట్ వీక్ సెలవులే సెలవులు

జూన్ నెల ఆదివారం సెలవుతోనే స్టార్ట్ అవుతోంది. ఆ తర్వాత సోమవారం అంటే జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం. ఆరోజు కూడా తెలంగాణలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులాగే ఉంటుంది... అవతరణ వేడుకల తర్వాత సమయం ఉంటుంది. అంటే వారు కొంత సమయం సర్దుబాటు చేసుకుంటే రెండురోజులు సెలవులే. ఈ వారంలో మరో నాలుగు రోజుల గడిస్తే మరోసారి వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తాయి.

46
జూన్ ఫస్ట్ వీక్ లోనే లాంగ్ వీకెండ్
Image Credit : our own

జూన్ ఫస్ట్ వీక్ లోనే లాంగ్ వీకెండ్

జూన్ 7న శనివారం ముస్లింల పవిత్ర పండగ బక్రీద్. కాబట్టి ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో సెలవు ఉంది. ఆ తర్వాతరోజు ఆదివారం ఎలాగూ సెలవే. ఇలా పిల్లలకు వేసవి సెలవుల ముగింపు సమయంలో పేరెంట్స్ కి వరుసగా రెండ్రోజుల సెలవులు వస్తున్నాయి... కాబట్టి అందరూ కలిసి హాయిగా ఏదయినా ట్రిప్ కు వెళ్లవచ్చు.

56
వెంటనే టికెట్స్ బుక్స్ చేసుకొండి
Image Credit : Getty

వెంటనే టికెట్స్ బుక్స్ చేసుకొండి

వచ్చేవారం వరుస సెలవుల నేపథ్యంలో ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసేవారు ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకోవడం మంచింది. ఎందుకంటే బస్సులు, విమానాలు, రైళ్లలో చివరిక్షణంలో టికెట్ బుకింగ్స్ సాధారణంగానే దొరకవు... ఇక సెలవుల వేళ అయితే అస్సలు దొరకవు. కాబట్టి మీ ట్రిప్ క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే టికెట్ బుక్ చేసుకొండి. ఇలా వేసవి సెలవులు ముగిసేముందు హాయిగా విహారయాత్రకు వెళ్లి మీ పిల్లలతో సరదాగా గడపండి.

66
వేసవి సెలవులు ముగిసాక వచ్చే సెలవులివే...
Image Credit : our own

వేసవి సెలవులు ముగిసాక వచ్చే సెలవులివే...

ఇక వేసవి సెలవులు ముగిసాక కూడా జూన్ లో మరికొన్ని సెలవులు వస్తున్నాయి. జూన్ రెండోవారంలో అంటే స్కూళ్లు ప్రారంభమైన రెండ్రోజులకే మరోసారి లాంగ్ వీకెండ్ వస్తోంది. జూన్ 12న తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకుంటాయి... అయితే జూన్ 14న రెండో శనివారం విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఇక ఆ తర్వాతిరోజు జూన్ 15 ఆదివారం. ఎలాగూ సాధారణ సెలవు ఉంటుంది. ఇలా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి.

జూన్ 27న రథయాత్ర సందర్భంగా ఏపీ, తెలంగాణలో ఐచ్చిక సెలవు ప్రకటించారు. 29న మళ్లీ ఆదివారం సెలవు. అయితే కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు శనివారం కూడా సెలవు ఉంటుంది... వారికి జూన్ 28న కూడా సెలవే అన్నమాట. అంటే కొందరు విద్యార్థులకు జూన్ 27, 28, 29 మూడ్రోజులు సెలవు ఉండే అవకాశాలున్నాయి... మిగతావారికి మూడ్రోజులు కాకున్నా రెండ్రోజులు సెలవు ఉంటుంది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ప్రయాణం
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Jobs: ఎలాంటి ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ లేకుండా ప్ర‌భుత్వ ఉద్యోగం.. నెల‌కు రూ. 17500 జీతం
Recommended image2
Hyderabad: రూ. 12 వేల కోట్లతో అద్భుత ప్రాజెక్ట్.. హైదరాబాద్ నుంచి గోవాకు భారీగా తగ్గనున్న దూరం
Recommended image3
Rain Alert: దూసుకొస్తున్న అల్ప‌పీడ‌నం.. ఈ ప్రాంతాల్లో ఉరుముల‌తో కూడిన‌ భారీ వ‌ర్షాలు, అల్లకల్లోలం ఖాయం
Related Stories
Recommended image1
Holidays : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే సమాచారం.. సమ్మర్ హాలిడేస్ ముగిసాక కూడా మరో 100 రోజుల సెలవులు
Recommended image2
School Holidays : జూన్ సగం వేసవి సెలవులే.. మిగతా రోజుల్లో వచ్చే హాలిడేస్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved