మీ ఇన్‌స్టాగ్రామ్‌ని ప్రైవేట్‌గా మార్చకుండానే సురక్షితంగా ఉంచుకోండి. హ్యాకింగ్, స్పామ్, అవాంఛిత ఇంటరాక్షన్ల నుంచి మీ పబ్లిక్ ప్రొఫైల్‌ని రక్షించుకోవడానికి ఐదు కీలక సెట్టింగ్‌లు చేసుకుంటే సరిపోతుంది. 

ఒకవేళ మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పబ్లిక్ ప్రొఫైల్ అంటే ఫాలోవర్ కాని వాళ్ళు కూడా మీ కంటెంట్‌ని చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. హ్యాకింగ్, స్పామ్ కామెంట్లు, ఇంపర్సనేషన్ లాంటి ప్రమాదాలకు మీ ఖాతాను గురిచేసే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు ప్రైవేట్ మోడ్‌ని ఉపయోగించుకోవచ్చు. కానీ కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా ఇన్ స్టా యాప్ లోనే కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్

టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ మీ పాస్‌వర్డ్‌కి అదనపు భద్రతను జోడిస్తుంది. ఈ ఫంక్షనాలిటీని ఎనేబుల్ చేయడం ద్వారా, మీరు కొత్త డివైస్ నుంచి లాగిన్ అయిన ప్రతిసారీ ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌ని కోడ్ కోసం అడుగుతుంది.

ఈ సెట్టింగ్‌ని ఎలా ఎనేబుల్ చేయాలి?

సెట్టింగ్‌లు > సెక్యూరిటీ > టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌కి వెళ్లి ఎనేబుల్ చేసుకోవాలి. 

రిస్ట్రిక్షన్ ఫీచర్

ఎవరైనా కామెంట్‌లలో లేదా డైరెక్ట్ మెసేజ్‌లలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అనుకుందాం. అయితే మీరు వారిని బ్లాక్ చేయకూడదనుకుంటే, మీరు మీ ప్రొఫైల్‌లో రిస్ట్రిక్ట్ ఆప్షన్‌ని ఉపయోగించవచ్చు. వారి యాక్సెస్ పరిమితం చేశారన్న విషయం వారికి తెలియదు. 

రిస్ట్రిక్ట్ ఫంక్షన్ ఎలా యాక్టివేట్ చేయాలి.? 

వారి ప్రొఫైల్‌ని సెలక్ట్ చేసుకొని.. మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత రిస్ట్రిక్ట్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి. 

కామెంట్‌లను ఫిల్టర్ చేయండి

మీకు వచ్చే కామెంట్స్ లో ఎవైనా అభ్యంతరకర భాష ఉంటే తొలగించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ AI లేదా కస్టమ్ కీవర్డ్‌లను ఉపయోగించడానికి  ఇది ఉపయోగపడుతుంది. 

ఈ ఫీచర్‌ని ఎలా యాక్టివేట్ చేయాలి?

సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రైవసీలోకి వెళ్లాలి. అనంతరం కస్టమ్ వర్డ్ ఫిల్టర్, కామెంట్‌ హైడ్ ను యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. 

మిమ్మల్ని మెన్షన్ చేయడం లేదా ట్యాగ్ చేయడం

స్పామ్ పోస్ట్‌లలో మిమ్మల్ని ట్యాగ్ చేయకుండా ఉండటానికి కామెంట్‌లు, పోస్టుల్లో మిమ్మల్ని మెన్షన్ చేయగల లేదా ట్యాగ్ చేయగల వారిని పరిమితం చేయండి.

ఎలా చేయాలి?

ప్రైవసీ ట్యాగ్‌లు, మెన్షన్‌ల సెట్టింగ్‌లకు వెళ్లండి. అక్కడ నోబడీ లేదా యువర్ ఫాలో ఆప్షన్స్ లో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోవాలి. 

తెలియని వ్యక్తులు లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటే

ఎవరైనా అనుమానాస్పదంగా లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా అలర్ట్ పొందొచ్చు. 

లాగిన్ హెచ్చరికను ఎలా ఎనేబుల్ చేయాలి?

సెట్టింగ్‌లలో సెక్యూర్ లాగిన్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి. అన్ నోన్ లాగిన్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఇమెయిల్‌ల విభాగంలో, హెచ్చరికలను ఎనేబుల్ చేయండి.