Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Andhra Pradesh
  • Nara lokesh : పవన్ కల్యాణ్ కంటే పవర్ ఫుల్ గా లోకేష్.. చంద్రబాబు పెద్ద ప్లానే వేస్తున్నారుగా..!

Nara lokesh : పవన్ కల్యాణ్ కంటే పవర్ ఫుల్ గా లోకేష్.. చంద్రబాబు పెద్ద ప్లానే వేస్తున్నారుగా..!

ప్రజల్లో పవన్ కల్యాణ్ కు రోజురోజుకు ఆదరణ పెరిగిపోతోంది. ఇది తన కొడుకు లోకేష్ కు ఎక్కడ ఇబ్బందులు తెచ్చిపెడుతుందోనని ఆందోళన చెందుతున్నారో ఏమోగానీ చంద్రబాబు నాయుడు ఓ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అది కడప మహానాడులో బైటపెట్టనున్నారట… 

Arun Kumar P | Updated : May 26 2025, 01:12 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
పవన్ కల్యాణ్ vs నారా లోకేష్
Image Credit : google

పవన్ కల్యాణ్ vs నారా లోకేష్

TDP Mahanadu : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయా? ఇకపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా పాలనాపగ్గాలు చేపట్టి కొడుకు లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించనున్నారా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే లోకేష్ పట్టాభిషేక కార్యక్రమం జరగనుందా? పవన్ కల్యాణ్ కంటే తన కొడుకును రాజకీయంగా స్ట్రాంగ్ చేయాలన్నదే చంద్రబాబు ప్లానా?... ఈ ప్రశ్నలన్నింటికీ రాజకీయ వర్గాల నుండి అవుననే సమాధానమే వినిపిస్తోంది.

25
జగన్ ఇలాకాలో టిడిపి పండగ
Image Credit : others

జగన్ ఇలాకాలో టిడిపి పండగ

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రతిఏటా మే 28న మహానాడు నిర్వహించే విషయం తెలిసిందే. టిడిపి నాయకులు, కార్యకర్తలంతా కలిసి రాష్ట్రంలోని ఏదోఒక ప్రాంతంలో భారీ కార్యక్రమాన్ని జరుపుకుంటారు... పార్టీ అధ్యక్షుడిని కూడా ఎన్నుకుంటారు. అలాగే పార్టీ కార్యక్రమాలను, ఎజెండాలను, వివిధ తీర్మాలను కూడా ఈ మహానాడు వేదికగానే ప్రకటిస్తారు. ఇలా ఈసారి మహానాడును ప్రత్యర్థిపార్టీ వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

Related Articles

Chandrababu: HALను ఆంధ్రకు తరలించండి.. చంద్రబాబు ప్లాన్ మాములుగా లేదు !
Chandrababu: HALను ఆంధ్రకు తరలించండి.. చంద్రబాబు ప్లాన్ మాములుగా లేదు !
అమరావతే శాశ్వత రాజధాని.. ఇకపై ఎవరూ ఏం చేయకుండా డిల్లీలో పావులు కదిపిన చంద్రబాబు
అమరావతే శాశ్వత రాజధాని.. ఇకపై ఎవరూ ఏం చేయకుండా డిల్లీలో పావులు కదిపిన చంద్రబాబు
35
మహానాడులో లోకేష్ కు పట్టం
Image Credit : google

మహానాడులో లోకేష్ కు పట్టం

ఈ మహానాడు వేదికగానే తన కొడుకు నారా లోకేష్ కు పట్టం కట్టేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సిద్దమైనట్లు తెలుస్తోంది. పాలనా బాధ్యతలతో పార్టీ వ్యవహారాలపై సరిగ్గా దృష్టిసారించలేకపోతున్నానని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పార్టీ బాధ్యతలన్నీ నారా లోకేష్ చూసుకుంటున్నారు. ఈ క్రమంలో లోకేష్ కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించి టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఈ మేరకు కడప మహానాడు వేదికన లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు రాజకీయ ప్రచారం జరుగుతోంది.

45
లోకేష్ తో పవన్ కల్యాణ్ చెక్
Image Credit : our own

లోకేష్ తో పవన్ కల్యాణ్ చెక్

ప్రస్తుతం లోకేష్ ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనకు పాలనలో ప్రమోషన్ ఇచ్చి డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్ టిడిపి వర్గాల నుండి వినిపించింది. అంటే పవన్ కల్యాణ్ కంటే తక్కువ కాకుండా అదే స్థాయి పదవి లోకేష్ కు ఇవ్వాలని తమ అధినేతను కోరారు టిడిపి శ్రేణులు. కానీ ఇది సాధ్యం కాలేదు... అందుకే టిడిపి పగ్గాలు లోకేష్ చేతిలోపెట్టి లీడర్లు, క్యాడర్ ను కూడా సంతృప్తిపర్చవచ్చన్నది చంద్రబాబు ప్లాన్ అయివుంటుంది. అందుకే లోకేష్ కు బాధ్యతలు అప్పగించేందుకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది.

55
ఒకే దెబ్బకు రెండుపిట్టలు... చంద్రబాబు ప్లాన్ ఇదే
Image Credit : ANI

ఒకే దెబ్బకు రెండుపిట్టలు... చంద్రబాబు ప్లాన్ ఇదే

లోకేష్ ను కడప మహానాడులో టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించడం ద్వారా చంద్రబాబు ఒకే దెబ్బకు రెండుపిట్టలు కొట్టనున్నారు. ఒకటి పవన్ కల్యాణ్ కంటే లోకేష్ ఏమాత్రం తక్కువకాదని టిడిపి శ్రేణులకు సందేశం ఇవ్వడం... ఇక వైఎస్ జగన్ కు సొంతజిల్లా నుండే గట్టి వార్నింగ్ ఇవ్వడం. గతంలో లోకేష్ ను పప్పు అని ఎద్దేవాచేసినవారికి కడప మహానాడు నుండి గట్టి సమాధానం చెప్పనున్నారు చంద్రబాబు. అందుకే లోకేష్ కు టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించేందుకు కడపను వేదికగా ఎంచుకున్నారు.

Arun Kumar P
About the Author
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు. Read More...
నారా చంద్రబాబు నాయుడు
ఆంధ్ర ప్రదేశ్
నారా లోకేష్
పవన్ కళ్యాణ్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
రాజకీయాలు
తెలుగుదేశం పార్టీ
జనసేన
 
Recommended Stories
Top Stories