MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • Marriage: పెళ్లి చేసుకుంటే 12 లక్షలు మీ సొంతం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Marriage: పెళ్లి చేసుకుంటే 12 లక్షలు మీ సొంతం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

పెళ్లి చేసుకోవాలంటే లక్షల్లో ఖర్చవుతుందని తెలిసిందే. అయితే ఒక దేశంలో మాత్రం పెళ్లి చేసుకుంటే రిటర్న్ గా డబ్బులు ఇస్తున్నారు. ఇంతకీ ఏంటా దేశం.? ఎందుకు డబ్బులు ఇస్తున్నారు.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

2 Min read
Author : Narender Vaitla
| Updated : May 26 2025, 01:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెళ్లి అంటేనే ఖర్చు:
Image Credit : Gemini

పెళ్లి అంటేనే ఖర్చు:

ప్రతీ మనిషి జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వీలైనంత వరకు ఘనంగా చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. ఇందుకోసం లక్ష‌ల్లో ఖ‌ర్చు చేస్తుంటారు. పెళ్లి కోసం అప్పుల మీద అప్పులు చేస్తారు.

ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ అంటూ ఖర్చు పెడుతుంటారు. బంధువులు, స్నేహితుల దగ్గర పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడతారు. పెళ్లి త‌ర్వాత అప్పులు చెల్లించేందుకు క‌ష్ట‌ప‌డుతుంటారు. ఈ అప్పులు కొత్త జంటకు భారంగా మారుతాయి. ఇదంతా మ‌న దేశంలో అయితే ఓ దేశంలో మాత్రం పెళ్లి చేసుకుంటే రూ. 12 ల‌క్ష‌లు ఇస్తారు. అదెక్క‌డంటే.

25
పెళ్లి చేసుకుంటే డ‌బ్బులు
Image Credit : Gemini

పెళ్లి చేసుకుంటే డ‌బ్బులు

దక్షిణ కొరియాలో జననాల రేటు, జనాభా తగ్గిపోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం జనాభా పెంచడానికి కొత్త పథకం తీసుకొచ్చింది. పెళ్లి చేసుకున్న జంటకు లక్షలాది రూపాయలు ఇస్తున్నారు. పెళ్లికి మాత్రమే కాదు, డేటింగ్ నుంచి నిశ్చితార్థం, హనీమూన్ వరకు ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. దేశంలో తగ్గుతున్న జనాభాను పెంచడమే ఈ పథకం ఉద్దేశ్యం. యువతను పెళ్లి చేసుకోవడానికి ప్రోత్సహించడమే లక్ష్యం.

Related Articles

Related image1
మతిపోగొట్టే ట్విస్ట్ తో క్లైమాక్స్.. కాజోల్, ఆమిర్ ఖాన్ నటించిన చిత్రానికి 19 ఏళ్ళు
Related image2
Instagram: మీ ఇన్‌స్టాగ్రామ్ సేఫేనా.? 5 సెట్టింగ్స్ చెక్ చేసుకోండి..
35
మ్యాచ్ మేకింగ్ కార్యక్రమం:
Image Credit : AdobeStock

మ్యాచ్ మేకింగ్ కార్యక్రమం:

దక్షిణ కొరియాలోని బుసాన్ జిల్లాలో ప్రత్యేక మ్యాచ్‌మేకింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని పెళ్లి చేసుకున్న జంటకు ప్రభుత్వం దాదాపు 14,700 డాలర్లు అంటే 12 లక్షల రూపాయలు ఇస్తుంది. గత సంవత్సరం బుసాన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త జంటకు 38,000 డాలర్లు అంటే 31 లక్షల రూపాయలు ఇచ్చారు.

దక్షిణ కొరియా ప్రపంచంలోనే అతి తక్కువ జనన రేటు కలిగిన దేశం. 2023లో జనన రేటు 0.72 ఉండగా, 2024లో 0.75కి పెరిగింది. కానీ ఇది చాలా తక్కువ.

45
జ‌నాభాను పెంచేందుకు ప్ర‌య‌త్నాలు
Image Credit : freepik

జ‌నాభాను పెంచేందుకు ప్ర‌య‌త్నాలు

దక్షిణ కొరియా ప్రభుత్వానికి జనాభా పెంచడం చాలా అవసరం. అందుకే కొత్త కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారు.

డబ్బుల కోస‌మైనా యువత పెళ్లిళ్లు చేసుకుంటారని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ పథకం జనాభా విధానంలో భాగమని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. జనన రేటు తగ్గడం, ప్రాంతీయ జనాభా తగ్గడం వంటి సమస్యలను పరిష్కరించడమే ఈ పథకం ఉద్దేశ్యం అని తెలిపారు.

55
జపాన్‌లో కూడా ఇదే సమస్య:
Image Credit : Asianet News

జపాన్‌లో కూడా ఇదే సమస్య:

దక్షిణ కొరియా మాత్రమే కాదు, జపాన్ కూడా జనాభా సమస్యను ఎదుర్కొంటోంది. జపాన్‌లో జననాల రేటు 50 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. సంవత్సరానికి 50 లక్షల జననాలు ఉండేవి, ఇప్పుడు 7 లక్షల 60 వేలకు తగ్గిపోయాయి. 2035లోపు ఈ సమస్యను పరిష్కరించవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే జపాన్ కూడా యువతను పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి ప్రోత్సహిస్తోంది. దీనికోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
ప్రపంచం
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Love Psychology: సైకాలజీ ప్రకారం ప్రేమలో ఉన్నవాళ్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఇవే!
Recommended image2
Relationship Psychology: సైకాలజీ ప్రకారం మనల్ని నిజంగా మిస్ అయ్యేవారు చేసే 5 పనులు ఇవే!
Recommended image3
Love Psychology: సైకాలజీ ప్రకారం అమ్మాయిలు, అబ్బాయిల నుంచి ఏం ఆశిస్తారో తెలుసా?
Related Stories
Recommended image1
మతిపోగొట్టే ట్విస్ట్ తో క్లైమాక్స్.. కాజోల్, ఆమిర్ ఖాన్ నటించిన చిత్రానికి 19 ఏళ్ళు
Recommended image2
Instagram: మీ ఇన్‌స్టాగ్రామ్ సేఫేనా.? 5 సెట్టింగ్స్ చెక్ చేసుకోండి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved