బీపీ తగ్గించుకోవాలనుకుంటున్నారా..అయితే ఈ Super Foods ని మీ మెనూలో చేర్చేయండి
బీపీ తగ్గించుకోవడానికి చాలా మంది మాత్రలు, వ్యాయామాలు వంటి ఎన్నో ప్రయత్నిస్తారు. కానీ, మనం రోజూ తినే కొన్ని ఆహారాలతో సులభంగా బీపీని తగ్గించుకోవచ్చు.
16

Image Credit : stockPhoto
అరటిపండు :
అరటిపండులో దాదాపు 422 మి.గ్రా. పొటాషియం ఉంటుంది. ఇది సోడియం ప్రభావాన్ని తగ్గించి, రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. బీపీని అదుపులో ఉంచుకోవడానికి ఇది చాలా అవసరం. అరటిపండును ఉదయం టిఫిన్‌గా, స్నాక్స్‌గా లేదా స్మూతీగా తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు కూడా మంచిది.
26
Image Credit : stockPhoto
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను సడలించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీని వల్ల బీపీ తగ్గుతుంది. రోజూ కొద్దిగా డార్క్ చాక్లెట్ తినడం మంచిది. ఇందులోని మెగ్నీషియం కూడా బీపీని అదుపులో ఉంచుతుంది.
36
Image Credit : stockPhoto
బీట్రూట్
బీట్రూట్‌లో సహజంగా నైట్రేట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను వ్యాకోచింపజేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని వల్ల బీపీ తగ్గుతుంది. ఒక కప్పు బీట్రూట్ జ్యూస్ తాగితే కొన్ని గంటల్లోనే బీపీ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులోని ఫోలేట్ గుండె ఆరోగ్యానికి మంచిది.
46
Image Credit : stockPhoto
దానిమ్మ :
దానిమ్మలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి రక్తనాళాలను సడలించి, వాపును తగ్గిస్తాయి. బీపీని అదుపులో ఉంచే ఎంజైమ్‌లను కూడా ఇవి సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. రోజూ ఒక కప్పు దానిమ్మ జ్యూస్ తాగడం మంచిది.
56
Image Credit : stockPhoto
అల్లం :
అల్లంలో జింజెరాల్స్, షోగోల్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తనాళాలను సడలించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఈ ప్రభావాల వల్ల బీపీ తగ్గుతుంది. అల్లంను టీ, సూప్ లేదా వంటల్లో వాడవచ్చు. అల్లం రక్తం గడ్డకట్టకుండా కూడా చేస్తుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.
66
Image Credit : stockPhoto
"నడక":
బీపీ తగ్గించుకోవడంలో ఆహారం లాగే, లేదా ఆహారం కంటే ముఖ్యమైనది వ్యాయామం. వైద్యులు కూడా రోజూ నడకను సూచిస్తున్నారు.
రోజూ 30-45 నిమిషాలు నడవడం వల్ల బీపీ బాగా తగ్గుతుంది. నడక వల్ల గుండె కొట్టుకునే వేగం సరిగ్గా ఉంటుంది, రక్తనాళాలు వ్యాకోచిస్తాయి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలోని అదనపు సోడియం చెమట ద్వారా బయటకు వెళ్లిపోతుంది.
Latest Videos

