ఈ రోజు శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C61 ప్రయోగించారు. అయితే ప్రయోగం జరిగిన కాసేపటికే మిషన్ పూర్తి కాలేదు. దీంతో పాటు ఈ రోజు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అలాగే హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతున్నాయి. వీటితో పాటు ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన అప్టేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

12:12 AM (IST) May 19
RCB Officially Qualifies for IPL 2025 Playoffs: విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ అభిమానుల ఆనందం రెట్టింపు అయ్యింది. ఎందుకంటే ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌లో ఆర్సీబీ అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆదివారం మూడు జట్ల ప్లేఆఫ్స్ స్థానాలు కన్ఫార్మ్ అయ్యాయి. మరో స్థానానికి పోటీ తీవ్రంగా ఉంది.
పూర్తి కథనం చదవండి11:53 PM (IST) May 18
KL Rahul: భారత స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో 5వ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన 60వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ 60 బంతుల్లో ఈ సెంచరీని పూర్తి చేశాడు. తన సెంచరీతో అనేక రికార్డులు సాధించాడు.
11:32 PM (IST) May 18
IPL 2025 DC vs GT: సాయి సుదర్శన్ సెంచరీతో పాటు శుభ్ మన్ గిల్ సూపర్ నాక్ తో ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. ఈ విజయంతో శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ జట్టు ప్లేఆఫ్స్ లోకి అడుగుపెట్టింది.
10:57 PM (IST) May 18
KL Rahul breaks Virat Kohli's record: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు సాధించలేని అరుదైన రికార్డును ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.
10:27 PM (IST) May 18
KL Rahul: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సెంచరీతో దుమ్మురేపాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో మూడు జట్లకు సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.
09:08 PM (IST) May 18
Saifullah Khalid : లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాది సైఫుల్లా ఖాలిద్ పాకిస్తాన్‌లో హతమయ్యాడు. రాంపూర్ CRPF క్యాంప్, బెంగళూరు ISC, నాగ్‌పూర్ RSS కార్యాలయాలపై దాడులకు సూత్రధారి అతనే.
పూర్తి కథనం చదవండి09:06 PM (IST) May 18
మీకు తెలుసా? పిల్లలు తమ క్యారెక్టర్ ని తల్లిదండ్రులను చూసే క్రియేట్ చేసుకుంటారు. మరి తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల ముందు ఎంత మెచ్యూర్డ్ గా ఉండాలి? పిల్లలు చక్కటి ప్రవర్తన కలిగి ఉండాలంటే తల్లిదండ్రులు ఏ 7 పనులు పిల్లల ముందు అస్సలు చేయకూడదు.
పూర్తి కథనం చదవండి08:07 PM (IST) May 18
Andhra Pradesh: విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో కారు లాక్ అవ్వడంతో ఊపిరాడక నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో రెండు ఘటనల్లో ఐదుగురు చిన్నారులు మృతి చెందారు.
07:32 PM (IST) May 18
IPL 2025 RR vs PBKS: ఐపీఎల్ 2025లో డూ ఆర్ డై మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) పై పంజాబ్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే గెలవాల్సిన ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ టీమ్ అద్భుత విజయం అందుకుంది. 10 పరుగుల తేడాతో రాజస్థాన్ పై పంజాబ్ గెలించింది.
06:59 PM (IST) May 18
india pakistan conflict: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ బెయిల్అవుట్ ప్యాకేజీని పొడిగించింది. కానీ, భారత్ ఆందోళనల మధ్య దీనికి 11 కొత్త షరతులు, 50 నిర్మాణాత్మక ప్రమాణాలు విధించింది.
పూర్తి కథనం చదవండి06:47 PM (IST) May 18
Yamaha: యమహా.. ఈ పేరంటే 90లలో యూత్ కి యమా క్రేజ్. ప్రత్యేకమైన బీటింగ్ ద్వారా అప్పట్లో ద్విచక్ర వాహన రంగంలో ఒక సంచలనే క్రియేట్ చేసింది. ఈ తరం యూత్ ని కూడా అట్రాక్ట్ చేయడానికి మళ్లీ మార్కెట్లోకి వచ్చేస్తోంది. అయితే ఈ సారి ఎలక్ట్రిక్ స్కూటర్ రూపంలో రానుంది. యమహా రీలాంచింగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా?
పూర్తి కథనం చదవండి06:02 PM (IST) May 18
Lunch Ideas: ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలని, ప్రోటీన్ ఫుడ్ తినాలని ఎవరికి ఉండదు చెప్పండి. కాని ఉదయం తొందరగా లంచ్ బాక్స్ తయారు చేయాలని ఆడవాళ్లు ఏదో ఒకటి వండి బాక్సు నింపి పంపించేస్తుంటారు. కాని మీ లంచ్ బాక్స్ పోషకాలతో నిండి ఉండాలంటే బెస్ట్ లంచ్ బాక్స్ ఐడియాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని ఓసారి ట్రై చేయండి.
పూర్తి కథనం చదవండి
05:55 PM (IST) May 18
Indian missile defence: పాకిస్తాన్ బెదిరింపుల మధ్య భారత నగరాలపై భద్రతా తనదైన టెక్నాలజీని అందిపుచ్చుకుని భారత్ మన దేశాశన్ని సురక్షితంగా ఎలా ఉంచుకోగలిగింది? భారత్ డిఫెన్స్ టెక్నాలజీ ఎలా పనిచేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.
05:24 PM (IST) May 18
Flipkart: ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్ హల్ చల్ చేస్తోంది. రూ.20,000 కంటే తక్కువ ధర ఉన్న స్మార్ట్‌ఫోన్‌లపై మాక్సిమం 37 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అలాంటి 5 అద్భుతమైన ఆఫర్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి05:14 PM (IST) May 18
hyderabad fire accident: చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
04:57 PM (IST) May 18
new Rs 20 notes: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ప్రకారం మహాత్మా గాంధీ (న్యూ) సిరీస్‌లో భాగంగా రూ.20 నోట్లు త్వరలో విడుదల కానున్నాను. ఈ నోట్లపై తాజాగా నియమితులైన ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. ఈ నోట్లు ఎప్పుడు మార్కెట్ లోకి రానున్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
04:42 PM (IST) May 18
Test captaincy records: రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. హిట్ మ్యాన్ తర్వాత భారత జట్టును ఎవరు నడిపిస్తారనే చర్చ సాగుతోంది. అయితే, రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీ రికార్డులను అధిగమించే సామర్థ్యం కలిగిన ఐదుగురు భారత క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
04:21 PM (IST) May 18
సుకన్య సమృద్ధి యోజన: దేశంలోని ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ముఖ్యమైన పథకం. ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఆడపిల్లల చదువు లేదా వివాహం కోసం మంచి మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. నెలకు రూ. 500 పొదుపు చేయడం ద్వారా ఎంత మొత్తం పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి04:11 PM (IST) May 18
TVS iQube: ప్రసిద్ధ టూవీలర్ కంపెనీ టీవీఎస్ నుంచి మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్టీ ఈ రెండు మోడల్స్ కొత్త అప్డేషన్స్ తో 2025 వెర్షన్స్ కింద విడుదలయ్యాయి. ఈ ఈవీల స్పెషల్ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి
03:36 PM (IST) May 18
అక్షయ్ కుమార్ కేసరి 2 సినిమాతో చాలా కాలంగా వార్తల్లో ఉన్నారు. అయితే, సినిమా అనుకున్నంతగా ఆడలేదు. ఈలోగా అక్షయ్ తన కొత్త సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు.
పూర్తి కథనం చదవండి03:27 PM (IST) May 18
వార్ 2 చిత్రం తారాగణం పారితోషికాలు: హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమా ప్రస్తుతం వార్తల్లో ఉంది. మే 20న సినిమా టీజర్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, సినిమా తారాగణం పారితోషికాల గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
03:17 PM (IST) May 18
మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న నటుడు విశాల్, మదురై ప్రజలను ప్రశంసించారు.
పూర్తి కథనం చదవండి03:15 PM (IST) May 18
ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా సైట్స్‌కు ఎంతలా ఆదరణ పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా యువత ఇన్‌స్టాగ్రామ్‌కు ఎక్కువ అట్రాక్ట్ అవుతోంది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మనకు తెలియని ఎన్నో ట్రిక్స్ ఉన్నాయి. అలాంటి ఒక ట్రిక్ ఇప్పుడు తెలుసుకుందాం.
03:01 PM (IST) May 18
నటుడు రవి మోహన్, ఆయన భార్య ఆర్తి విడాకులు తీసుకోవడానికి నటుడు ధనుష్ కారణమని గాయని సుచిత్ర తెలిపారు.
పూర్తి కథనం చదవండి02:30 PM (IST) May 18
హైదరాబాద్ చార్మినార్‌కు సమీపంలోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏకంగా 16 మంది మరణించారు. ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రధాని మోదీ మొదలు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులంతా ఈ సంఘటనపై స్పందించారు.
01:27 PM (IST) May 18
ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ బుకింగ్ విధానంలో కీలక మార్పును చేశారు. ఇకపై స్లీపర్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
01:10 PM (IST) May 18
Gold Prices: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మే 18, 2025 న కూడా తగ్గాయి. గత కొంత కాలంలో బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. కొన్ని వారాలుగా గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు అస్థిరంగా ఉండటంతో ధరలు తగ్గుతున్నాయని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ రోజు తగ్గాయి. అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండి12:44 PM (IST) May 18
హైదరాబాద్ నగరంలోని చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషాదకర ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.
12:35 PM (IST) May 18
Swimming Tips: వేసవిలో వేడిని తట్టుకోవడం కష్టమే. అందుకే చాలామంది రిలాక్సేషన్ కోసం దగ్గర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్స్, చెరువులు, కాలువల్లో ఈతకు వెళ్తుంటారు. స్విమ్మింగ్ రాకపోయినా ఫ్రెండ్స్ అడిగారని నీటిలోకి దిగిపోతుంటారు. ఈతకు వెళ్లే వాళ్లు ఈ విషయాలు తెలుసుకోకపోతే ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుంది.
పూర్తి కథనం చదవండి12:17 PM (IST) May 18
హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తొలుత 8 మంది మరణించారని వార్తలు వచ్చాయి. అయితే కాలం గడుస్తోన్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో తీవ్ర విషాదం నెలకొంది.
11:50 AM (IST) May 18
కర్ణాటకలోని ఓ గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన బిర్దేవ్ సిద్ధప్ప ధోనె అనే యువకుడు తన కష్టంతో, పట్టుదలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఏప్రిల్ 22న విడుదలైన UPSC ఫలితాల్లో ఆల్ ఇండియా ర్యాంక్ 551 సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచాడు. ఇది అతనికి మూడవ ప్రయత్నం. ప్రస్తుతం అతనికి వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే.
11:47 AM (IST) May 18
మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 31 ఫస్ట్ లుక్ విడుదల చేయాలని అనుకున్నారు. కానీ వార్ 2 సినిమా అనౌన్స్‌మెంట్ కూడా అదే రోజు ఉండటంతో, ఫస్ట్ లుక్ వాయిదా వేశారు.
పూర్తి కథనం చదవండి10:46 AM (IST) May 18
Top 10 Historical Places in India: ఈ వీకెండ్లో ఏదైనా టూర్‌కి ప్లాన్ చేస్తున్నారా? ఎక్కడికి వెళ్లాలని తెగ ఆలోచిస్తున్నారా? డో వర్రీ మన దేశంలోనే ఎన్నో హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. మీకోసమే.. ఇండియాలో టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితాను అందిస్తున్నాం. వీటిపై ఓ లుక్కేయండి.
పూర్తి కథనం చదవండి10:21 AM (IST) May 18
హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వాణిజ్య భవనంలోని మొదటి అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు సంఘటనా స్థలంలోనే, మరో ఐదుగురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది.
10:10 AM (IST) May 18
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అమెరికా దౌత్యంతో ఈ ఒప్పందం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఒప్పందం ఆదివారం (మే 18)తో ముగియనున్నట్లు నెట్టింట్ వార్తలు ట్రెండ్ అవుతోన్న నేపథ్యంలో రక్షణ శాఖ వర్గాలు కీలక ప్రకటన చేసింది.
09:45 AM (IST) May 18
ఆపరేషన్ సిందూర్ వివరాలను, పాకిస్థాన్ కుట్రలను ప్రపంచదేశాలకు తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షంతో ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బృందంలో ఉన్న ఎంపీలు ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లి పాకిస్థాన్ చేస్తున్న కుట్రలను వివరించనున్నారు. అలాగే ఆపరేషన్ సిందూర్ ద్వారా దేశం సాధించిన విజయాన్ని ప్రపంచానికి తెలియజేయనున్నారు.
09:12 AM (IST) May 18
జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహం ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. ఇది శక్తివంతమైనదే కాకుండా, అనేకమందికి భయం కలిగించే గ్రహంగా భావిస్తారు. శని అనగానే వామ్మో అంటారు. అయితే శని దేవుడి దయ చూపినప్పుడు అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తాడు.
07:49 AM (IST) May 18
ప్రతీ రోజూ దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తిరుపతికి విచ్చేస్తుంటారు. వీరి కోసం తిరుమలతో పాటు తిరుపతిలోనూ నిత్యం ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేపడుతూనే ఉంటారు. తాజాగా తిరుపతిలో కొత్త బస్ స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఏకంగా రూ. 500 కోట్లతో ఎయిర్‌పోర్టును తలపించేలా ఈ బస్ టెర్నినల్‌ను నిర్మించనున్నారు.
07:04 AM (IST) May 18
తెలుగు రాష్ట్రాలపై తుపాను ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చిరించింది. రానున్న రెండు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఏర్పడ్డ అల్పపీడనం మరికొన్ని గంటల్లో తుపానుగా మారనుందని అంచనా వేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
06:48 AM (IST) May 18
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదివారం PSLV C-61 చేపట్టిన విషయం తెలిసిందే. ఆదివాయం ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్‌ను ప్రయోగించారు. అయితే ప్రయోగం మొదలైన కాసేపటికే మిషన్ ఫెయిల్ అయినట్లు అధికారులు ప్రకటించారు. వివరల్లోకి వెళితే..