MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • RR vs PBKS: రాజ‌స్థాన్ పై థ్రిల్లింగ్ విక్ట‌రీ.. ప్లేఆఫ్ రేసులో పంజాబ్ కింగ్స్

RR vs PBKS: రాజ‌స్థాన్ పై థ్రిల్లింగ్ విక్ట‌రీ.. ప్లేఆఫ్ రేసులో పంజాబ్ కింగ్స్

IPL 2025 RR vs PBKS: ఐపీఎల్ 2025లో డూ ఆర్ డై మ్యాచ్ లో రాజస్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్) పై పంజాబ్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీ కొట్టింది. ప్లేఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవంగా ఉంచుకోవాలంటే గెల‌వాల్సిన ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్య‌ర్ టీమ్ అద్భుత విజ‌యం అందుకుంది. 10 ప‌రుగుల తేడాతో రాజ‌స్థాన్ పై పంజాబ్ గెలించింది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 18 2025, 07:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Shreyas Iyer. (Photo: PBKS Media)

Shreyas Iyer. (Photo: PBKS Media)

IPL 2025 RR vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 59వ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR) మరియు పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జ‌రిగింది. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విక్ట‌రీ కొట్టింది. దీంతో త‌న ప్లేఆఫ్స్ ఆశాలు స‌జీవంగా ఉంచుకుంది.  

25

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కు ఆ జ‌ట్టు బ్యాట‌ర్లు అద్భుత‌మైన బ్యాటింగ్ తో ప‌రుగులు వ‌ర్షం కురిపించారు. 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి పంజాబ్ 219 ప‌రుగులు చేసింది. 

Related Articles

Related image1
IPL 2025: RCB ఫైనల్ చేరితే.. కోహ్లీ టీమ్ తో ఏబీ డివిలియన్స్ ను చూడొచ్చు !
Related image2
IPL 2025:దంచికొడుతున్నారు.. ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న టాప్ 5 బ్యాటర్లు
35
preity zinta pbks

preity zinta pbks

పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్ర‌భు సిమ్రాన్ సింగ్ 21 ప‌రుగులు, శ్రేయాస్ అయ్య‌ర్ 30 ప‌రుగులు చేశారు. నేహ‌ల్ వ‌ధేరా 70 ప‌రుగుల సూప‌ర్ ఇన్నింగ్స్ ను ఆడాడు. త‌న ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు బాదాడు. అలాగే, శ‌శాంక్ సింగ్ 59  ప‌రుగుల ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాదాడు. 

 

45

220 ప‌రుగులు భారీ టార్గెట్ లో రెండో ఇన్నింగ్స్ ను మొద‌లుపెట్టిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు మంచి ఆరంభం ల‌భించింది. య‌శ‌స్వి జైస్వాల్ 50 ప‌రుగుల ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 1 సిక్స‌ర్ బాదాడు. మ‌రో యంగ్ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ 15 బంతుల్లో 40 ప‌రుగుల ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాదాడు. ధ్రువ్ జూరేల్ 53 ప‌రుగులు ఇన్నింగ్స్ ఆడాడు.

55

అయితే, మిగ‌తా ప్లేయ‌ర్లు రాణించ‌క‌పోవ‌డం, కీల‌క స‌మ‌యంలో వికెట్లు ప‌డ‌టంతో రాజ‌స్థాన్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 209 ప‌రుగులు చేసింది. 10 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. ఈ గెలుపుతో పంజాబ్ టీమ్ ప్లేఆఫ్ ఆశ‌లు స‌జీవంగా ఉన్నాయి. పంజాబ్ టీమ్ 17 పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలోకి చేరింది. ఆర్సీబీ టాప్ లో ఉంది. మూడో స్థానంలో గుజ‌రాత్ టైటాన్స్, 4వ స్థానంలో ముంబై ఇండియ‌న్స్ ఉంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలను పిచ్చిగా ఇష్టపడే ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకంతఇష్టమంటే?
Recommended image2
నెక్ట్స్ మ్యాచ్ కాదు.. టీ20 వరల్డ్ కప్ నుండే అభిషేక్ ఔట్..? జట్టులోకి యంగ్ ప్లేయర్ ఎంట్రీ ఫిక్స్
Recommended image3
మైదానంలో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. టీమిండియాపై పాక్ జట్టుదే పైచేయి
Related Stories
Recommended image1
IPL 2025: RCB ఫైనల్ చేరితే.. కోహ్లీ టీమ్ తో ఏబీ డివిలియన్స్ ను చూడొచ్చు !
Recommended image2
IPL 2025:దంచికొడుతున్నారు.. ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న టాప్ 5 బ్యాటర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved