MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • KL Rahul: ఐపీఎల్ లో 5వ సెంచరీతో కేఎల్ రాహుల్ సాధించిన రికార్డులు ఇవే

KL Rahul: ఐపీఎల్ లో 5వ సెంచరీతో కేఎల్ రాహుల్ సాధించిన రికార్డులు ఇవే

KL Rahul: భారత స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో 5వ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన 60వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెన‌ర్ గా వ‌చ్చిన కేఎల్ రాహుల్ 60 బంతుల్లో ఈ సెంచరీని పూర్తి చేశాడు. త‌న సెంచరీతో అనేక రికార్డులు సాధించాడు.   

2 Min read
Mahesh Rajamoni
Published : May 18 2025, 11:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
KL Rahul

KL Rahul

KL Rahul Century: ఐపీఎల్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ మరో సెంచరీ సాధించాడు. ఇది అతని ఐపీఎల్ కెరీర్‌లో 5వ సెంచరీ. ఐపీఎల్ 2025 60వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డింది. కేఎల్ రాహుల్ 60 బంతుల్లో ఈ సెంచరీని పూర్తి చేశాడు.

ఫోర్ కొట్టి త‌న సెంచ‌రీని పూర్తి చేసిన కేఎల్ రాహుల్ మొత్తంగా 65 బంతులు ఎదుర్కొని 112 పరుగులు చేశాడు. 172 డెడ్లీ స్ట్రైక్ రేట్‌తో సాగిన అత‌ని బ్యాటింగ్ లో 14 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాదాడు. కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2022 తర్వాత సాధించిన ఐపీఎల్ సెంచరీ ఇది. 

26
KL Rahul

KL Rahul

ఇది రాహుల్ కు 5వ ఐపీఎల్ సెంచరీ. 2022 సీజన్ తర్వాత ఈ టోర్నమెంట్ లో అతని మొదటి సెంచరీ. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రాహుల్ ఇప్పుడు నాల్గవ స్థానానికి చేరుకున్నాడు.

కేఎల్ రాహుల్ నాలుగు సెంచరీలతో తనతో సమానంగా ఉన్న శుభ్‌మాన్ గిల్‌ను అధిగమించాడు. ఐపీఎల్ 2025లో ప్రియాంష్ ఆర్య, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలతో పాటు సెంచరీ చేసిన 5వ బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. టీ20 క్రికెట్‌లో కేఎల్ రాహుల్‌కు ఇది 7వ సెంచరీ.

Related Articles

DC vs GT: ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు షాకిచ్చి ప్లేఆఫ్స్ కు చేరిన‌ గుజ‌రాత్ టైటాన్స్
DC vs GT: ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు షాకిచ్చి ప్లేఆఫ్స్ కు చేరిన‌ గుజ‌రాత్ టైటాన్స్
KL Rahul: విరాట్ కోహ్లీ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన కేఎల్ రాహుల్
KL Rahul: విరాట్ కోహ్లీ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన కేఎల్ రాహుల్
36
KL Rahul

KL Rahul

14 ఫోర్లు, 4 సిక్సర్లు.. 172  స్ట్రైక్ రేట్ తో 112 పరుగులు

ఇన్నింగ్స్‌ను ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్‌లో రాహుల్ 65 బంతులు ఎదుర్కొని 112 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. ఈ తుఫాను ఇన్నింగ్స్‌లో అతను 14 ఫోర్లు, 4 సిక్సర్లు కూడా కొట్టాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన సమయంలో అతని స్ట్రైక్ రేట్ 172గా ఉంది. గుజరాత్‌పై అత్య‌ధిక వ్యక్తిగ‌త స్కోర్ చేసిన ఏ బ్యాట్స్‌మన్ గా కేఎల్ రాహుల్ నిలిచాడు. 2023 సీజన్ ప్రారంభంలో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ వాంఖడేలో 103* పరుగులు చేశాడు, ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరు.

46
KL Rahul (Photo: @DelhiCapitals/X)

KL Rahul (Photo: @DelhiCapitals/X)

ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన 5 మంది బ్యాట్స్‌మెన్‌లు

1. విరాట్ కోహ్లీ - 8 సెంచరీలు
2. జోస్ బట్లర్ - 7 సెంచరీలు
3. క్రిస్ గేల్ - 6 సెంచరీలు
4. కెఎల్ రాహుల్ - 5 సెంచరీలు
5. శుభ్‌మాన్ గిల్ - 4 సెంచరీలు

టీ20ల్లో అత్యధిక సెంచరీలు-భార‌త ప్లేయ‌ర్లు 

విరాట్ కోహ్లీ - 9
రోహిత్ శర్మ - 8
అభిషేక్ శర్మ - 7
కేఎల్ రాహుల్ - 7

56
KL Rahul (Photo- IPL)

KL Rahul (Photo- IPL)

మూడు జ‌ట్ల‌కు సెంచ‌రీలు చేసిన  తొలి బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ 

ఐపీఎల్‌లో మూడు జట్ల తరపున సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. అతనికి ముందు, ఐపీఎల్‌లో ఎవరూ ఈ ఘనతను సాధించలేకపోయారు. పంజాబ్ కింగ్స్ తరపున 2 సెంచరీలు, లక్నో సూపర్ జెయింట్స్ తరపున 2 సెంచరీలు చేశాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిట‌ల్స్ తరపున ఆడుతూ సెంచరీ చేశాడు.

66
Asianet Image

కేఎల్ రాహుల్ చేసిన 5 ఐపీఎల్ సెంచరీలు ఇవే 

100* (64) పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్, 2019
132* (69) పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2020
103* (60) లక్నో సూపర్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్, 2022
103* (62) లక్నో సూపర్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్, 2022
112* (65) ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్, 2025

About the Author

Mahesh Rajamoni
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
 
Recommended Stories
India vs England 3rd Test Day 3 Live : ఇండియా vs ఇంగ్లాండ్ లైవ్ అప్డేట్స్
India vs England 3rd Test Day 3 Live : ఇండియా vs ఇంగ్లాండ్ లైవ్ అప్డేట్స్
Shubman Gill: టెస్టు, వన్డేల్లో డబుల్ సెంచరీలు కొట్టిన టాప్-5 ప్లేయర్లు వీరే
Shubman Gill: టెస్టు, వన్డేల్లో డబుల్ సెంచరీలు కొట్టిన టాప్-5 ప్లేయర్లు వీరే
Joe Root: పాంటింగ్, స్మిత్ రికార్డులను బ్రేక్ చేసిన జోరూట్
Joe Root: పాంటింగ్, స్మిత్ రికార్డులను బ్రేక్ చేసిన జోరూట్
Top Stories
Janasena - డ్రైవర్ హత్యకేసులో కోట వినుతను సస్పెండ్ చేసిన జనసేన.. ఏ జరిగింది?
Janasena - డ్రైవర్ హత్యకేసులో కోట వినుతను సస్పెండ్ చేసిన జనసేన.. ఏ జరిగింది?
Telugu Cinema News Live: చంద్రబాబు, వైఎస్‌ఆర్‌ స్నేహంపై `మాయసభ`.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడ అంటే ?
Telugu Cinema News Live: చంద్రబాబు, వైఎస్‌ఆర్‌ స్నేహంపై `మాయసభ`.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడ అంటే ?
India vs England 3rd Test Day 3 Live : ఇండియా vs ఇంగ్లాండ్ లైవ్ అప్డేట్స్
India vs England 3rd Test Day 3 Live : ఇండియా vs ఇంగ్లాండ్ లైవ్ అప్డేట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved