MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఆర్బీఐ కొత్త గవర్నర్ సంతకంతో కొత్త రూ.20 నోట్లు: పాత, కొత్త నోట్ల మధ్య తేడా అదొక్కటే

ఆర్బీఐ కొత్త గవర్నర్ సంతకంతో కొత్త రూ.20 నోట్లు: పాత, కొత్త నోట్ల మధ్య తేడా అదొక్కటే

new Rs 20 notes: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ప్రకారం మహాత్మా గాంధీ (న్యూ) సిరీస్‌లో భాగంగా రూ.20 నోట్లు త్వరలో విడుదల కానున్నాను. ఈ నోట్లపై తాజాగా నియమితులైన ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. ఈ నోట్లు ఎప్పుడు మార్కెట్ లోకి రానున్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.     

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 18 2025, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 11, 2024 నుంచి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం మూడు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఆయన హయాంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న తొలి నోట్ ఇది. కొత్త రూ.20 నోటు రూపకల్పన, లక్షణాలు ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.20 నోట్లతో సమానంగా ఉంటాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పాత రూ.20 నోటుకు, కొత్త రూ.20 నోటుకు తేడా ఏమిటంటే కొత్త గవర్నర్ సంతకం మాత్రమే భిన్నంగా ఉంటుంది. పాత రూ.20 నోట్లు చెలామణిలో కొనసాగుతాయని ఆర్బీఐ అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నోట్లు మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో భాగంగా ఆకుపచ్చ-పసుపు రంగులో ఎల్లోరా గుహల చిత్రంతో ఉంటాయి.

 

35

RBI చట్టం, సెక్షన్ 26(2) ప్రకారం రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన ప్రతి కాయిన్, నోటును ప్రజలంతా కచ్చితంగా ఉపయోగించాలి. ఇది చెల్లుబాటు కాదు అని ఎవరూ అనడానికి వీల్లేదు. ఈ విధంగా ఆర్బీఐ చట్టం చెబుతోంది.

ఆర్‌బీఐ ప్రకారం చట్టపరంగా చెలామణిలో ఉన్న ప్రతి నోటు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉపయోగించొచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ హామీతో చెలామణి అవుతాయి. అదే విధంగా భారత ప్రభుత్వం విడుదల చేసిన రూ.1 నోట్లు కూడా చెలామణిలో చెల్లుబాటు అవుతాయి.

45

దేశంలోని నోట్లు నాలుగు కరెన్సీ ప్రెస్‌లలో ముద్రిస్తారు. అందులో రెండు నాసిక్ (పశ్చిమ భారతదేశం), దేవాస్ (మధ్య భారతదేశం) ప్రాంతాల్లో భారత ప్రభుత్వ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) ఆధ్వర్యంలో ఉన్నాయి.

మరో రెండు మైసూరు (దక్షిణ భారతదేశం), సాల్బోని (తూర్పు భారతదేశం) ప్రాంతాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL) ద్వారా నిర్వహణలో ఉన్నాయి. 

55

నాణేలు ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, నోయిడాలోని నాలుగు మింట్లలో తయారవుతాయి. ఇవన్నీ భారత ప్రభుత్వ సంస్థ SPMCIL యాజమాన్యంలో ఉన్నాయి.

మొత్తానికి కొత్త రూ.20 నోట్లు త్వరలోనే మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయన్న మాట. పాత నోట్లు కూడా చెలామణి అవుతాయి కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
ప్రభుత్వ పథకాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Recommended image2
Amazon Sale: వాషింగ్ మెషీన్ కొనేందుకు ఇదే మంచి టైమ్.. అమెజాన్ లో బెస్ట్ డీల్స్ ఇవిగో
Recommended image3
Gold Price Fall: నవరాత్రి వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. దిగొచ్చిన బంగారం
Related Stories
Recommended image1
EPFO: ఏటీఎంలలోనే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు: ఎప్పటి నుంచో తెలుసా?
Recommended image2
పాన్ కార్డ్ మోసాలకు చెక్ పెట్టాలంటే కొత్త పాన్ కార్డ్ 2.0 తీసుకోండి: కేవలం రూ.50లే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved