MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • మీరు ఈ 7 తప్పులు చేస్తే మీ పిల్లలు కూడా వాటిని నేర్చుకుంటారు

మీరు ఈ 7 తప్పులు చేస్తే మీ పిల్లలు కూడా వాటిని నేర్చుకుంటారు

మీకు తెలుసా? పిల్లలు తమ క్యారెక్టర్ ని తల్లిదండ్రులను చూసే క్రియేట్ చేసుకుంటారు. మరి తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల ముందు ఎంత మెచ్యూర్డ్ గా ఉండాలి? పిల్లలు చక్కటి ప్రవర్తన కలిగి ఉండాలంటే తల్లిదండ్రులు ఏ 7 పనులు పిల్లల ముందు అస్సలు చేయకూడదు. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 18 2025, 09:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పిల్లలు తమ చుట్టూ ఉన్న వాతావరణం, జనాన్ని బట్టి ప్రవర్తనను మార్చుకుంటారు. చుట్టూ ఉండే రకరకాల మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎలా మట్లాడుతున్నారు? ఎలా నవ్వుతున్నారు? ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇలాంటివన్నీ తమ చుట్టూ ఉండే వారి నుంచే నేర్చుకుంటారు. ముఖ్యంగా తల్లిదండ్రుల చర్యల ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతారు. చిన్న వయసులో క్రియేట్ అయిన కొన్ని ప్రవర్తనలు శాశ్వతంగా ఉండిపోతాయి. అవి మారడం కష్టం. కొన్ని సందర్భాల్లో అవే పిల్లల ఎదుగుదలకు సహకరిస్తాయి. నాశనం కూడా చేస్తాయి. అందుకే పిల్లల ముందు తల్లిదండ్రులు ఈ 7 పనులు అస్సలు చేయకూడదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

1. గొడవలు పడొద్దు

పిల్లల ముందు ఎప్పుడూ వాదనలు పెట్టుకోకూడదు. అరవడం, గొడవపడటం లాంటివి చేయకూడదు. దీనివల్ల పిల్లలు తమకు కూడా రక్షణ ఉండదని భావిస్తారు. ఇది వారిలో ఒత్తిడిని పెంచుతుంది. భావోద్వేగాలు బయటపెట్టడానికి కూడా భయపడతారు. ఇలా కాకుండా ప్రశాంతంగా, గౌరవంగా మాట్లాడుకోండి.

2. తీవ్రమైన కోపం చూపించొద్దు

పిల్లలు వారు చూసేదాన్ని అనుకరిస్తారు. తల్లిదండ్రులు గాని కంట్రోల్ చేసుకోలేని కోపాన్ని చూపిస్తే పిల్లలు కూడా అలాంటివే అనుకరిస్తారు. 

Related Articles

Related image1
పిల్లల కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే పేరెంట్స్ ఏం చేయాలంటే..
Related image2
రాత్రిపూట చాక్లెట్ తింటే కడుపులో ఇలా అవుతుందా?
35

3. ఇతరులను విమర్శించొద్దు

కుటుంబ సభ్యులతో సహా ఇతరుల గురించి ప్రతికూలంగా మాట్లాడటం వల్ల పిల్లలు సానుభూతి, దయ చూపించడం కంటే వెక్కిరించడం, విమర్శించడం నేర్చుకుంటారు.

4. అబద్ధం చెప్పొద్దు 

పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి నిజాయితీని నేర్చుకుంటారు. వారు అబద్ధాలు అడినా, తీర్చలేని వాగ్దానాలు చేసినా వారు నమ్మడం మానేస్తారు. తరువాత జీవితంలో ఎవరినీ నమ్మకపోవడం లాంటి సమస్యలను ఎదుర్కొంటారు. 

45

5. వారి చెప్పేది వినకపోతే బాధపడతారు

తల్లిదండ్రులు పిల్లల భావోద్వేగాలను పట్టించుకోకపోతే చాలా బాధపడతారు. ఇదే కొనసాగితే వారు మొండి వారిగా తయారైపోతారు. ఇది వారి క్యారెక్టర్ నే మార్చేస్తుంది. పెద్దయ్యాక వారి భావాలను వ్యక్తీకరించడంలో ఇబ్బంది పడతారు. దీని కెరీర్ లో కూడా సమస్యలు ఎదుర్కొంటారు. ఎదుగుదల లేక డిప్రెషన్ లోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది. పిల్లలు ఏం చెప్పినా శ్రద్ధగా తల్లిదండ్రులు వినాలి. తర్వాత వారి డౌట్స్ తీర్చాలి. 

 

55

6. కఠినమైన పదాలు వాడొద్దు

మాటలకు చాలా శక్తి ఉంటుంది. నిరంతరం విమర్శించడం లేదా పేరు పెట్టడం లాంటివి చేస్తుంటే పిల్లల ఆత్మవిశ్వాసం కోల్పోతారు. అది వారి ఆత్మగౌరవాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

7. మీరు ఫోన్ కు అతుక్కుపోకండి 

తల్లిదండ్రులు తమ ఫోన్‌లు, టీవీలకు అతుక్కుపోతే పిల్లలు కూడా అలాగే తయారవుతారు. కొన్నాళ్లకి తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలనుకున్నా పిల్లలు కఠినంగా మారిపోతారు. ఇది పిల్లల భావోద్వేగాలపై ప్రభావం చూపుతాయి. తల్లిదండ్రులు ఈ 7 పనులు అస్సలు చేయకండి.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
జీవనశైలి
చిన్నారుల సంరక్షణ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Related Stories
Recommended image1
పిల్లల కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే పేరెంట్స్ ఏం చేయాలంటే..
Recommended image2
రాత్రిపూట చాక్లెట్ తింటే కడుపులో ఇలా అవుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved