Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Business
  • Indian Railway: స్లీప‌ర్ ఛార్జీల‌తో ఏసీ బోగీలో ప్ర‌యాణించ‌వ‌చ్చు.. రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం.

Indian Railway: స్లీప‌ర్ ఛార్జీల‌తో ఏసీ బోగీలో ప్ర‌యాణించ‌వ‌చ్చు.. రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం.

ఇండియ‌న్ రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం టికెట్ బుకింగ్ విధానంలో కీల‌క మార్పును చేశారు. ఇక‌పై స్లీప‌ర్ టికెట్ తీసుకున్న ప్ర‌యాణికులు ఏసీ కోచ్‌లో ప్ర‌యాణించ‌వ‌చ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం..   

Narender Vaitla | Published : May 18 2025, 01:27 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Indian Railway

Indian Railway

ఇండియన్ రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైళ్లలోని AC కోచ్‌ల (Chair Car, 3AC, 2AC, 1AC) లో ఖాళీగా ఉన్న సీట్లు ఆటో అప్‌గ్రేడ్ ద్వారా SL (స్లీపర్), 2S (సెకండ్ సిటింగ్) టికెట్ కలిగిన ప్రయాణికులకు ఇవ్వనుంది. ఈ ప్రక్రియ ఫస్ట్ చార్ట్ తయారయ్యే సమయంలో ఉంటుంది. అంటే రైలు బ‌య‌టుదేరే నాలుగు గంట‌ల ముందు. 
 

25
Asianet Image

అయితే ఇది క‌రెంట్ బుకింగ్‌పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ప‌డనుంది. రైలు బయలుదేరే ముందు చివరి నిమిషంలో టికెట్ బుకింగ్ చేసుకునేందుకే క‌రెంబ్ బుకింగ్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిసిందే. అయితే AC కోచ్‌లలో ఖాళీ సీట్లు ముందుగానే SL, 2S confirmed టికెట్ల వారికి అప్‌గ్రేడ్ చేస్తే క‌రెంట్ బుకింగ్ ల‌భించే అవ‌కాశం త‌గ్గుతుంది. 

అయితే SL, 2S కోచ్‌లకు మాత్రం క‌రెంట్ బుకింగ్ సీట్లు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కూడా, అత్యవసర కోటా, వేటింగ్ లిస్ట్ ప్రాసెస్ అయిన తర్వాత సీట్లు మిగిలితేనే క‌రెంట్ బుకింగ్స్ ల‌భిస్తాయి

Related Articles

Gold Prices: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇంకా తగ్గాయి. ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇవే..
Gold Prices: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇంకా తగ్గాయి. ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇవే..
new Rs 20 notes: మార్కెట్ లోకి కొత్త రూ. 20 నోటు.. పాత నోట్లు చెల్ల‌వా? 
new Rs 20 notes: మార్కెట్ లోకి కొత్త రూ. 20 నోటు.. పాత నోట్లు చెల్ల‌వా? 
35
Asianet Image

అప్‌గ్రేడ్ విధానం ఎలా ఉంటుంది?

SL టికెట్ ఉన్నవారిని 3AC లేదా 2ACకి అప్‌గ్రేడ్ చేయవచ్చు. 2S టికెట్ ఉన్నవారు విస్డ‌మ్‌2S లేదా చెయిర్ కార్‌కి అప్‌గ్రేడ్ అవ్వొచ్చు. అయితే, 1AC లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కి అప్‌గ్రేడ్ కేవలం ఒక స్టెప్ కింద నుంచి మాత్రమే (2AC నుంచి 1AC, CC నుంచి EC) ఉంటుంది. ఉదాహరణకి, 3AC టికెట్ ఉన్నవారు నేరుగా 1ACకి అప్‌గ్రేడ్ కావడం క‌ష్టంగా మారుతుంది. 

45
Asianet Image

త‌త్కాల్ టికెట్ తీసుకున్నవారు లేదా పూర్తి టికెట్ ధర చెల్లించి టికెట్ ఉన్నవారికే ఈ ఆటో అప్‌గ్రేడ్ అవకాశం ఉంటుంది. డిస్కౌంట్ టికెట్లకు ఈ అప్‌గ్రేడ్ వర్తించదు. ఈ నిర్ణ‌యం వ‌ల్ల ఖాళీగా ఉండే AC సీట్లు వృథా కాకుండా, ఇప్పటికే టికెట్ కలిగిన ప్రయాణికులకే ఉపయోగపడతాయి.
 

55
Asianet Image

SL, 2S క‌న్ఫామ్‌ టికెట్ ఉన్నవారికి మెరుగైన ప్రయాణ అనుభవం లభిస్తుంది. త‌త్కాల్ టికెట్ ఉన్న వారికి ఏసీ బోగీల‌కు అప్‌గ్రేడ్ అయ్యే అవ‌కాశాలు మెరుగ‌వుతాయి. ప్ర‌స్తుతం చాలా ట్రైన్లలో AC సీట్లు ముందుగానే బుక్ అవుతున్నాయి. కానీ, ఆఫ్-సీజన్‌లో కొన్నిసార్లు ఖాళీలు మిగులుతున్నాయి. అప్పుడు SL, 2S టికెట్ ఉన్నవారికి అప్‌గ్రేడ్ అవకాశముంటుందని రైల్వే అధికారులు తెలిపారు. 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
పర్సనల్ పైనాన్స్
ప్రయాణం
 
Recommended Stories
Top Stories