KL Rahul: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్
KL Rahul breaks Virat Kohli's record: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు సాధించలేని అరుదైన రికార్డును ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.

KL Rahul breaks Virat Kohli's record
KL Rahul breaks Virat Kohli's record: ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో మరో కేఎల్ రాహుల్ అరుదైన మైలురాయి సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో మరో హిస్టరీని క్రియేట్ చేశాడు.
KL Rahul
మే 18న అరుణ్ జైట్లీ స్టేడియంలో ఐపీఎల్ 2025 60 మ్యాచ్ లో ఢిల్లీ-గుజరాత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 8000 టీ20 పరుగులు పూర్తి చేశాడు. దీంతో అత్యంత వేగంగా 8వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత ఆటగాడిగా ఘనత సాధించాడు.
33 ఏళ్ల కేఎల్ రాహుల్ ఈ ఘనతను కేవలం 224 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండగా, అతను దీనిని సాధించేందుకు 243 ఇన్నింగ్స్‌లను తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో రాహుల్.. కోహ్లీని అధిగమించి టీ20ల్లో 8000 పరుగులు సాధించిన ఫాస్టెస్ట్ ఇండియన్‌గా నిలిచాడు.
టీ20ల్లో 8000 పరుగులకు అత్యంత వేగంగా సాధించిన ఆటగాళ్లు
1. క్రిస్ గేల్ - 213 ఇన్నింగ్స్
2. బాబర్ ఆజం - 218 ఇన్నింగ్స్
3. KL రాహుల్ - 224 ఇన్నింగ్స్
4. విరాట్ కోహ్లీ - 243 ఇన్నింగ్స్
5. మొహమ్మద్ రిజ్వాన్ - 244 ఇన్నింగ్స్
KL Rahul (Photo- IPL)
ఈ మ్యాచ్‌కు ముందు కేఎల్ రాహుల్‌కు 8000 పరుగుల మార్కును చేరేందుకు 33 పరుగుల అవసరముండగా.. అతను డీసీ తరఫున ఓపెనర్‌గా ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి ఇన్నింగ్స్ ను ఆరంభించాడు. ఇది ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈ సీజన్‌లో ఏడవ ఓపెనింగ్ జోడీ కావడం విశేషం. మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టాడు.
KL Rahul (Photo: @DelhiCapitals/X)
కేఎల్ రాహుల్ 65 బంతుల్లో 112 పరగులు చేశారు. తన సెంచరీ ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. అతని సెంచరీ ఇన్నింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.
ఈ సెంచరీతో ఐపీఎల్ లో మూడు జట్లకు సెంచరీలు కొట్టిన ప్లేయర్ గా కేఎల్ రాహుల్ ఘనత సాధించాడు. ఇంతకు ముందు పంజాబ్ కింగ్స్ (Punjab Kings), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) తరఫున సెంచరీలు కొట్టిన కేఎల్ రాహుల్.. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తరఫున తన తొలి సెంచరీ సాధించాడు.