Astrology: ఈ రాశుల వారికి శని ఎప్పుడూ మంచే చేస్తాడు.. కొంత కాలం కష్టం ఉన్నా
జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహం ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. ఇది శక్తివంతమైనదే కాకుండా, అనేకమందికి భయం కలిగించే గ్రహంగా భావిస్తారు. శని అనగానే వామ్మో అంటారు. అయితే శని దేవుడి దయ చూపినప్పుడు అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సాధారణంగా శని ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశి మారుతుంది. కొన్ని రాశుల పైన శని ప్రభావం శుభప్రదంగా పనిచేస్తుంది. ఆ రాశుల వారికి శని ఎల్లప్పుడూ అనుకూలంగా ఉంటాడు. ఈ శని అనుగ్రహంతో వారు ఏ పని చేసినా గొప్ప విజయాలను పొందుతారు. ముఖ్యంగా నిధులు, ఆరోగ్యం, ఉద్యోగం, సామాజిక స్థితిలో మంచి మార్పులు వస్తాయి. శని కటాక్షం ఉండే నాలుగు రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మకర రాశి:
మకరరాశిలో జన్మించినవారు శని స్వరాశిలో ఉండడం వల్ల నిరంతరం దాని దయకు పాత్రులవుతారు. ఈ రాశివారికి ఎదురయ్యే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగం, వ్యాపార రంగాలలో ఆకస్మిక విజయాలు సాధించగలుగుతారు. ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరతారు.
వృషభ రాశి:
వృషభరాశివారిపై శని అనుగ్రహం ఉన్నప్పుడు వారి కష్టపడే ధోరణికి ప్రతిఫలం లభిస్తుంది. ఆశించిన స్థాయిలో సంపాదన లభించడంతో పాటు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. శ్రమతో ఉన్నత స్థానాలను చేరుకుంటారు.
కుంభ రాశి:
కుంభరాశి కూడా శనిదేవుని పాలనలో ఉండే రాశి. కాబట్టి ఈ రాశివారిపై శని ఎల్లప్పుడూ అనుకూలంగా ఉంటుంది. వారు చేసిన శ్రమ వృథా కాకుండా, సమయానుకూలంగా విజయం అందుతుంది. ముఖ్యంగా ధన సంబంధిత విషయాల్లో నష్టాలు దరిచేరవు. కొంత కష్టం ఎదురైనా చివరికి విజయం వరిస్తుంది.
తుల రాశి:
తులారాశిలో జన్మించినవారికి శని మంచి ఫలితాలు అందిస్తుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని సమర్థవంతంగా అధిగమించగలుగుతారు. ఆరోగ్యపరంగా మెరుగుదల కనిపిస్తుంది. శని అనుగ్రహం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి విజయం సులభమవుతుంది.