MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Swimming Tips: వేసవిలో స్విమ్మింగ్ కి వెళ్తున్నారా? ఇవి తెలుసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం

Swimming Tips: వేసవిలో స్విమ్మింగ్ కి వెళ్తున్నారా? ఇవి తెలుసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం

Swimming Tips: వేసవిలో వేడిని తట్టుకోవడం కష్టమే. అందుకే చాలామంది రిలాక్సేషన్ కోసం దగ్గర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్స్, చెరువులు, కాలువల్లో ఈతకు వెళ్తుంటారు. స్విమ్మింగ్ రాకపోయినా ఫ్రెండ్స్ అడిగారని నీటిలోకి దిగిపోతుంటారు. ఈతకు వెళ్లే వాళ్లు ఈ విషయాలు తెలుసుకోకపోతే ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుంది.

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 18 2025, 12:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రస్తుతం వేసవి సెలవలు కాబట్టి అందరూ వెకేషన్స్ కి నానమ్మ, అమ్మమ్మల ఇంటికి వెళ్తుంటారు. సాధారణంగా ఊర్లలో చెరువులు, కాలువలు ఉంటాయి కాబట్టి సమ్మర్ హీట్ నుంచి తప్పించుకోవడానికి వాటిల్లో స్నానానికి వెళ్తారు. ఈత రాకపోయినా నీటిలో లోతుకు దిగిపోతారు. ఏం కాదన్న అతి నమ్మకం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. చెరువులు, కాలువలు, నదులు లాంటి నీటి ప్రదేశాల్లో స్నానానికి వెళ్లే వాళ్లు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

1. చెరువులు, కుంటలు, బావులు, కాలువల వంటి నీటి ప్రాంతాల్లో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి అనుమతి లేకుండా నీటిలోకి దిగితే ప్రమాదాలు తప్పవు.

2. కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు లోతు తెలియకుండా నీటిలోకి దిగిపోకూడదు. సురక్షిత ప్రాంతంలోనే స్నానం చేయాలి.

3. ముఖ్యంగా పిల్లలను ఒంటరిగా నీటిలోకి దింపకూడదు. వారితోపాటు పెద్దలు తప్పనిసరిగా ఉండాలి. 

35

4. చెరువులు, కాలువల్లో దిగినప్పుడు ఈత వచ్చిన వారు తోడుగా ఉండేలా చూసుకోవాలి. నీటిలోతు తెలియకుండా దిగిపోకూడదు.

5. ఈత నేర్చుకోవాలనుకున్న వారు ట్రైనర్ల పర్యవేక్షణలో మాత్రమే నేర్చుకోవాలి. ఈత వచ్చిన వారిని దగ్గర పెట్టుకొని దిగిపోకూడదు. 

6. పూర్తి స్థాయిలో ఈత వచ్చిన తర్వాత మాత్రమే స్వతంత్రంగా నీటిలోకి దిగాలి. ముఖ్యంగా పిల్లలను ఒంటరిగా నీటిలోకి దిగనివ్వకూడదు.

 

45

7. ప్రస్తుతం వేసవి కాబట్టి విద్యార్ధులు, యువత ఇంట్లో చెప్పకుండా ఈత కోసం వెళ్లిపోతుంటారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే పిల్లలు ఎక్కడకు వెళ్తున్నారో చెప్పి వెళ్లేలా సూచనలు చేయాలి. 

8. నీటి ప్రమాదాల గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అర్థమయ్యేలా, ఓపిగ్గా చెప్పాలి. లేకపోతే వారి మొండిగా, ఇంట్లో చెప్పకుండా చెరువుల వద్దకు వెళ్తారు. 

9. మధ్యాహ్న సమయంలో ఈతకు వెళ్లకూడదు. అధిక వేడి వల్ల శరీరానికి, ముఖ్యంగా గుండెకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

 

55

10. జలాశయాల్లో మద్యం తాగి ఈతకు దిగకూడదు. ఇది అత్యంత ప్రమాదకరం. స్పీడుబోట్లు, నీటిపై నడిచే ఇతర వాహనాల ప్రభావంతో తేలికగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

11. పూర్తిగా ఈత తెలుసుకున్న వారు మాత్రమే కాస్త లోతు ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లాలి. సెలవుల్లో పిల్లలు ఏం చేస్తున్నారో పెద్దలు గమనిస్తూ ఉండాలి. 

12. జలాశయాలు, నదుల వద్ద ప్రభుత్వం నిర్దేశించిన హెచ్చరికల బోర్డులను కచ్చితంగా గమనించాలి. వాటిని పట్టించుకోకుండా నీటిలోకి దిగితే ప్రాణాలకే ప్రమాదం. 

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Related Stories
Recommended image1
సీనియర్ సిటిజన్లకు ఇండియన్ రైల్వే ఇన్ని సౌకర్యాలు కల్పిస్తోందా?
Recommended image2
పౌర్ణమి రోజు ఈ 7 ప్రదేశాలు తప్పకుండా చూడాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved