ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు సంబంధించిన అప్డేట్స్, భారత్ పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించిన వివరాలతో పాటు ఈ రోజు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్ మ్యాచ్ అప్టేడ్స్. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
12:14 AM (IST) May 04
PM Modi Congratulates Anthony Albanese: ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల్లో ప్రధానమంత్రి ఆంథనీ అల్బనీస్ ఘనవిజయం సాధించారు. రెండో సారి ప్రధానిగా ఎన్నికైన ఆల్బనీస్ కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
పూర్తి కథనం చదవండి
11:56 PM (IST) May 03
Pakistan soldier arrested at rajasthan border: బీఎస్ఎఫ్ రాజస్థాన్ సరిహద్దులో చోరబడిన ఒక పాకిస్తాన్ రేంజర్ ని అరెస్ట్ చేసింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
11:28 PM (IST) May 03
IPL 2025 RCB vs CSK: చెన్నై సూపర్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ 2025 52వ మ్యాచ్‌లో రొమారియో షెపర్డ్ తుఫాన్ ఇన్నింగ్స్ తో పాటు ఆయూష్ మాత్రే అదరిపోయే బ్యాటింగ్ తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వర్షం వచ్చింది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో ఆర్సీబీ సూపర్ విక్టరీ కొట్టింది.
10:57 PM (IST) May 03
ధర్మేంద్ర, సన్నీ, బాబీ డియోల్ లు వేర్వేరు సమయాల్లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. వాళ్ళ మొదటి సినిమాలు, సక్సెస్ గురించి తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి10:40 PM (IST) May 03
Chandrababu Naidu: అమరావతి రాజధాని అభివృద్ధి పనుల పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతిపై చేసిన కామెంట్స్ రాష్ట్ర అభివృద్ధికి నూతన నమ్మకాన్ని అందించాయన్నారు. సభ విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకమైందనీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేశారని పేర్కొన్నారు.
10:31 PM (IST) May 03
మా సంస్థ నిర్మిస్తున్న ‘కాంతార 1’ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు చేరేలా వ్యూహరచన చేస్తున్నాం. ఇది కన్నడ చిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయిలో ఒక ముఖ్యమైన అడుగు వేసే ప్రయత్నం’ అని చలువే గౌడ అన్నారు.
పూర్తి కథనం చదవండి10:16 PM (IST) May 03
Virat Kohli breaks 5 records: ఐపీఎల్ 2025 అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నాడు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 62 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పాటు అనేక రికార్డులను సాధించాడు. కింగ్ కోహ్లీ సాధించిన 5 రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
10:04 PM (IST) May 03
క్వినోవా అంటే ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే ఒకరకమైన ధాన్యం. ఇది గోధుమలు, బియ్యానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఈ ధాన్యంతో సులభంగా, త్వరగా తయారు చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్కూళ్లకు వెళ్లే పిల్లలకు, ఆఫీసులకు వెళ్లే పెద్దలకు ఇది చాలా ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్.
పూర్తి కథనం చదవండి09:48 PM (IST) May 03
IPL 2025 RCB vs CSK: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడుతున్న వెస్టిండీస్ ఆటగాడు రోమారియో షెపర్డ్ దుమ్మురేపే ఇన్నింగ్స్ ను ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలను దంచికొడుతూ ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి రికార్డుల మోత మోగించాడు.
08:46 PM (IST) May 03
TVS iQube: టీవీఎస్ కంపెనీకి చెందిన ఐక్యూబ్ ఫ్యామిలీ స్కూటర్‌గా మంచి గుర్తింపు పొందింది. ఇప్పుడు ఐక్యూబ్ కొత్త అప్ డేట్స్ తో మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐక్యూబ్ లో కొత్త ఫీచర్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందామా?
పూర్తి కథనం చదవండి08:44 PM (IST) May 03
Pakistani soldiers killed by BLA: పాక్ ఆర్మీపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. 22 మంది పాక్ సైనికులు హతమయ్యారని సమాచారం. అలాగే, ఆరుగురు బీఎల్‌ఏ ఫైటర్స్ సైతం మరణించారనీ, పాక్‌లో కొన్ని పట్టణాలపై బీఎల్ఏ పట్టు సాధించినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
08:20 PM (IST) May 03
No SC Status After Religious Conversion: మతం మారితే ఎస్సీ హోదా ఇక ఉండదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. మతం మారిన వారు ఎస్సీ హోదా ద్వారా చట్టబద్ధ రక్షణలు పొందలేరని స్పష్టం చేసింది. ఇది భారత రాజ్యాంగ ఉద్దేశాలకు విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈకేసు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
07:24 PM (IST) May 03
India vs Pakistan: చెన్నై నుండి వచ్చిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని కొలంబోలోని బందారనాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత నిఘా సంస్థలు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నారనే హెచ్చరికతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
పూర్తి కథనం చదవండి07:17 PM (IST) May 03
నెయ్యిలో కొలెస్ట్రాల్ ఉంటుందని చాలామంది దాన్ని తినడం మానేస్తారు. కానీ ప్రతిరోజూ ఒక చెంచా నెయ్యి తినాలని ఆయుర్వేదం చెబుతోంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తింటే కలిగే లాభాలు తెలిస్తే మీరు వెంటనే నెయ్యి తినడం ప్రారంభిస్తారు. నెయ్యి వల్ల లాభాలు తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి06:59 PM (IST) May 03
మంచి ఎండలో బయటకు వెళ్లామనుకోండి. విపరీతంగా దాహం వేస్తుంది కదా.. వెంటనే వాటర్ బాటిల్ కొని తాగేస్తాం. కాని బాటిల్ మూత ఏ కలర్ లో ఉందో గమనించం. కాని బాటిల్ మూత కలర్ మీరు ఎలాంటి నీరు తాగుతున్నారో చెబుతుంది. వాటర్ బాటిల్ మూత ఏ కలర్ ను బట్టి ఆ నీరు ఎంత నాణ్యమైనదో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి06:30 PM (IST) May 03
Skype: వీడియో కాల్ అంటే స్కైప్ కాల్ అనేంతగా గుర్తింపు పొందిన స్కైప్ ఇక క్లోజ్ అవుతోంది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీయే కన్ఫర్మ్ చేసింది. దీనికి కారణాలు ఏంటో వివరాలు తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి06:14 PM (IST) May 03
Land Grabbing Allegations Against Roja's Family: చిత్తూరు జిల్లా విజయపురం మండలం కలింబాక గ్రామానికి చెందిన ఇల్లత్తు గుణశేఖర రెడ్డి అనే రైతు తన ఫిర్యాదులో మాజీ మంత్రి రోజా, ఆమె భర్త సెల్వమణి, నగరి మున్సిపల్ చైర్మన్, మీనాకుమార్ లు తన కుటుంబ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి రేకుల షెడ్ నిర్మించారని పేర్కొన్నారు.
పూర్తి కథనం చదవండి05:44 PM (IST) May 03
కాకరకాయ చేదుతో ఇబ్బంది పడుతున్నారా? కాకరకాయ చేదును తగ్గించి రుచి పెంచడానికి 5 సూపర్ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఉప్పు, నిమ్మరసం, పెరుగు, మసాలా దినుసులతో రుచికరమైన కాకరకాయ వంటకాలు తయారు చేసుకోండి.
పూర్తి కథనం చదవండి05:27 PM (IST) May 03
IPL 2025: Top 3 super catches: ఐపీఎల్ 2025 సీజన్ అత్యంత ఉత్కంఠభరితంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు 51 మ్యాచ్‌లు పూర్తి కాగా, కొన్ని బౌలింగ్‌తో, మరికొన్ని బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాయి. అయితే ప్రేక్షకుల గుండెలను గెలిచింది మాత్రం ఫీల్డర్ల అద్భుత క్యాచ్‌లే. ఈ ఏడాది మూడు అద్భుతమైన క్యాచ్‌లు అభిమానుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి. రషీద్ ఖాన్ ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేయడం, కమిందు మెండిస్ డెవాల్డ్ బ్రెవిస్‌ను అద్భుతంగా పెవిలియన్ కు పంపడం, దుష్మంత సమీరా అనుకూల్ రాయ్‌ను అవుట్ చేయడం.. ఇవన్నీ ఐపీఎల్ 2025 లో సూపర్ క్యాచ్ లు గా నిలిచాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
04:59 PM (IST) May 03
కుటుంబ నియంత్రణ అనగానే ముందుగా గుర్తొచ్చేది మహిళలు ఉపయోగించే గర్భనిరోధక మాత్రలు. అదే పురుషుల విషయానికొస్తే కండోమ్స్. అయితే కండోమ్స్ కాకుండా మరే ప్రత్యామ్నాయ అవకాశం లేదా.? అంటే కచ్చితంగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఆ దిశగా కీలక అడుగు వేశారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
03:35 PM (IST) May 03
ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ ఓయో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. భారత్‌లో మొదలైన ఈ హోటల్ చైన్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు తన సేవలను విస్తరించింది. ముఖ్యంగా యువతను ఆకర్షిస్తూ హోటల్ సేవలను అందిస్తున్న ఓయో తాజాగా మరో రంగంలోకి అడుగు పెట్టింది.
03:04 PM (IST) May 03
ప్రధానమంత్రి మోదీ గుచ్చి పుట్టగొడుగు అనే పుట్టగొడుగును ఇష్టంగా తింటారు. చాలా ఖరీదైన ఈ పుట్టగొడుగులో ఏ పోషకాలు ఉన్నాయి? ధర ఎంత? దాని ప్రత్యేకత ఏమిటి? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి03:00 PM (IST) May 03
Electric Scooters: పెట్రోల్ ధరలు భరించలేక ఇప్పుడు ఎక్కువ మంది ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు ఇవి కాస్త ధర ఎక్కువగా ఉండేవి కాని, ఇప్పుడు బడ్జెట్ లోనే దొరుకుతున్నాయి. దీనికి తక్కువ మెయింటనెన్స్, పొల్యూషన్ కూడా ఉండవు కాబట్టి ఎక్కువ మంది కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇండియాలో ఎక్కువగా అమ్ముడయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి
01:54 PM (IST) May 03
పాకిస్తాన్ మాజీ ప్రధాని, ఒకప్పటి క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అధికార దుర్వినియోగ ఆరోపణలతో ఆయనకు 14 ఏళ్ల శిక్షవిధించారు. కాగా తాజాగా ఆయనకు సంబంధించి ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తి కథనం చదవండి01:15 PM (IST) May 03
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ ప్రతీకార చర్యలు తీవ్రతరం చేస్తోంది. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న భారత్ తాజాగా వాణిజ్య పరంగా కూడా పాక్ కు చెక్ పెట్టే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
పూర్తి కథనం చదవండి12:56 PM (IST) May 03
ఓలా, ఉబర్, రాపిడో బుక్ చేసుకుని మనం క్యాన్సిల్ చేశామనుకోండి క్యాన్సిలేషన్ ఛార్జ్ వసూలు చేస్తారు కదా.. అదే డ్రైవర్ క్యాన్సిల్ చేస్తే ఎలాంటి ఛార్జ్ వసూలు చేయరు. ఇప్పుడు ఈ విషయంపై కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. దీంతో ప్రయాణికులకు లాభం కలుగుతుంది. ఆ రూల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
12:48 PM (IST) May 03
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలు 2025 కోసం హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. ఈ పోటీలు ఈనెల 7 నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఈవెంట్ సౌందర్యం, భద్రత, సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది.
11:55 AM (IST) May 03
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులు ప్రారంభం కావడంతో దేశం దృష్టి ఒక్కసారిగా అటు పడింది. రాష్ట్ర విభజన జరిగి దాదాపు 11 ఏళ్లు గడుస్తోన్నా రాజధాని లేదనే వెలితి ఏపీ ప్రజలను వెంటాడుతూనే ఉంది. అయితే ఆ వెలితిని పూర్తి చేయడానికి చంద్రబాబు సర్కారు కీలక అడుగు వేసింది. ఇకపై వెనక్కి తగ్గేదేలే అన్నట్లు అమరావతి నిర్మాణంలో వేగాన్ని పెంచింది.
11:09 AM (IST) May 03
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాషింగ్ మిషన్ పెట్టే స్థానం కూడా మీకు శుభ, అశుభ ఫలితాలను కలిగిస్తుందని మీకు తెలుసా? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఏ స్థానంలో వాషింగ్ మిషన్ పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి10:34 AM (IST) May 03
ఇడ్లీ పాత్ర లేకుండా ఇడ్లీ ఎలా తయారు చేయాలి: ఇడ్లీ పాత్ర లేదా? పర్వాలేదు! స్టీల్ గిన్నెలతో మెత్తని, స్పాంజి ఇడ్లీలు తయారు చేయండి. సులభమైన పద్ధతి, చిట్కాలు తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి10:22 AM (IST) May 03
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. అమరావతి నిర్మాణంలో తన భుజాన్ని కలుపుతానని, మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో పాటు పవన్‌పై ప్రశంసలు కురిపించారు మోదీ.
10:18 AM (IST) May 03
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. అమరావతి నిర్మాణంలో తన భుజాన్ని కలుపుతానని, మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో పాటు పవన్‌పై ప్రశంసలు కురిపించారు మోదీ.
10:13 AM (IST) May 03
పిల్లలు మొబైల్ చూస్తూనే తినడం ఎలా ఆపాలి: ఈ రోజుల్లో పిల్లలు మొబైల్ లేకుండా తినరు. ఇది వారికి ప్రమాదకరం. పిల్లలకు మొబైల్ అలవాటును ఎలా మాన్పించాలో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి09:50 AM (IST) May 03
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సెలబ్రెటీ జంట ఏ బ్రాండ్ నీళ్లు తాగుతారు, వాటి ధర ఎంతో చూద్దాం.
09:34 AM (IST) May 03
యువత పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటున్నారు?: ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు పెళ్లి పేరు చెబితేనే భయపడుతున్నారు. పర్సనర్, కెరీర్ లైఫ్ లో సరైన భాగస్వామిని ఎంచుకోలేకపోతున్నారు. అలాగే విడాకుల భయం వంటి ఎన్నో కారణాలు దీనికి ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి09:25 AM (IST) May 03
అప్పు తీసుకోవడం సర్వసాధారణమైన విషయం. మనలో ప్రతీ ఒక్కరం ఏదో ఒక సమయంలో అప్పు తీసుకునే ఉంటాం. అయితే కొందరు తీసుకున్న అప్పును పర్ఫెక్ట్ గా తిరిగి చెల్లిస్తే మరికొందరు మాత్రం చెల్లించడంలో ఇబ్బందులు పడుతుంటారు. అయితే చేసిన అప్పును తిరిగి సులభంగా ఎలా చెల్లించాలన్న ప్రశ్నను ఏఐ చాట్ జీపీటీని అడిగితే ఏం సమాధానం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి09:06 AM (IST) May 03
వాకింగ్ చేసేటప్పుడు ఎక్కువగా చెమటలు వస్తే.. బరువు తగ్గినట్టేనా అనే విషయాన్ని తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి09:06 AM (IST) May 03
భారతదేశంలో 7,308 కి పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అయితే సహజంగానే రైల్వే స్టేషన్లు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని తెలిసిందే. అయితే దేశంలో ఒక ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఉందని మీకు తెలుసా.? ఇంతకీ ఏంటా రైల్వే స్టేషన్.? ఎక్కడ ఉంది.? దాని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి08:39 AM (IST) May 03
గోవాలోని లైరాయి దేవి ఆలయంలోదారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయారు. 15 మందికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి07:54 AM (IST) May 03
కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతీ రోజూ వేలా మంది భక్తులు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి భక్తులు తిరుపతి విచ్చేస్తుంటారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం టీటీడీ ఏర్పాట్లను అదే స్థాయిలో చేస్తుంది. ఎప్పటికప్పుడు భక్తుల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్న టీటీడీ తాజాగా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..