పాకిస్తాన్ మాజీ ప్రధాని, ఒకప్పటి క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అధికార దుర్వినియోగ ఆరోపణలతో ఆయనకు 14 ఏళ్ల శిక్ష‌ విధించారు. కాగా తాజాగా ఆయనకు సంబంధించి ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో లైంగిక వేధింపులకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో ఓ డాక్యుమెంట్ చక్కర్లు కొడుతోంది. రావల్పిండిలోని పాక్ ఎమిరేట్స్ మిలిటరీ హాస్పిటల్ (PEMH) ఇమ్రాన్ ఖాన్ కు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆ డాక్యుమెంట్ లో పేర్కొన్నారు. అయితే, అధికారుల ప్రకారం, ఇస్లామాబాద్ లోని పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS) వైద్యుల బృందం ఖాన్ కు వైద్య పరీక్షలు నిర్వహించింది. దీంతో ఈ వైరల్ డాక్యుమెంట్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డాక్యుమెంట్ నిజమో కాదో ఇంకా అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు.

గమనిక: ఈ వైరల్ మీడియా నివేదిక యొక్క ప్రామాణికతను Asianet News స్వతంత్రంగా ధృవీకరించడం లేదు. కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వివరాలను ఇక్కడ ప్రస్తావించాం. 

“లైంగిక వేధింపుల కేసులో డిశ్చార్జ్ అధికారం పెండింగ్‌లో ఉంది” అని డాక్యుమెంట్ లో పేర్కొన్నారు. డాక్యుమెంట్ లో రోగి పేరు ఇమ్రాన్ అహ్మద్ ఖాన్ నియాజీ అని ఉంది. శారీరక పరీక్ష విభాగంలో, “అస్థిరంగా (హైపోటెన్షన్, టాచీకార్డియా); ఇటీవలి శారీరక దాడికి ఆధారాలు (ఎక్కైమోసెస్, రాపిడి)” అని పేర్కొన్నారు. “బాహ్య పెరినియల్ ఎక్కైమోసిస్, వాపు” అని పేర్కొన్నారు.

Scroll to load tweet…

రావల్పిండిలోని ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ (COAS), జనరల్ హెడ్ క్వార్టర్స్ (GHQ) కార్యాలయం నుంచి ప్లేస్‌మెంట్ ఆర్డర్, రాతపూర్వక డిశ్చార్జ్ అధికారం అందిన తర్వాత మాత్రమే డిశ్చార్జ్ పత్రాలు జారీ చేస్తామని డాక్యుమెంట్ చివరలో పేర్కొన్నారు. 

పాకిస్తాన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 2023 నుంచి జైలులో ఉన్నారు. ఈ జనవరిలో అధికార దుర్వినియోగం, అవినీతికి సంబంధించిన కేసులో ఖాన్‌కు 14 సంవత్సరాల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.